జేసీ ట్రావెల్స్ బస్సు స్కాంలో జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలు కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఈ కేసులో తమకేం తెలియదని.. బ్రోకర్ ద్వారా వాహనాలు కొనుగోలు చేశామని బుకాయిస్తున్నారట.. తప్పుడు వ్యవహారంలో వారిద్దరూ తప్పించుకోలేరని పక్కా ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
జేసీ తండ్రీకొడుకులతోపాటు మరో నలుగురిపై 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ సమయంలోనే జేసీ కొత్త నాటకానికి తెరతీసినట్లు తెలుస్తోంది.
జేసీ తండ్రీకొడుకులు స్క్రాబ్ వాహనాల కుంభకోణంలో తమకేమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తాము నమ్మిన బ్రోకర్లే ఈ వ్యవహారం నడిపారని కేసు నుంచి తప్పించుకునే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ తప్పంతా తాము జేసీ ఆదేశాలతోనే చేసినట్లు ఇతర నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో జేసీ తండ్రికొడుకులు తప్పించుకునే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం వ్యవహారంలో వీరి పాత్ర స్పష్టంగా ఉండడంతో ఎన్ని నాటకాలు ఆడినా తప్పించుకునే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.