వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అనంతపురం ఎంపీ.. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి అలవాటే. కడుపులో ఏదీ దాచుకోకుండా మనసులో ఏం అనిపిస్తే అది అనేసే జేసీ.. నిత్యం ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేస్తుంటారు. దీనికి తగ్గట్లే ఆయన కనిపిస్తే చాలు.. ఆయన నోటి వెంట ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్య వచ్చే ప్రశ్నను సంధించటం మీడియాకూ అలవాటే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అదే రీతిలో రియాక్ట్ అయ్యారు జేసీ.
సినిమాల్లో పవన్ కల్యాణ్ నటన ఆకట్టుకునేలా ఉంటుందని.. కానీ.. రాజకీయాల్లో మాత్రం ఆయనకు రాణించేంత సీన్ లేదన్నారు. ‘సినిమాల్లో ఆయన రాణిస్తారు. అందులోసందేహం లేదు. కానీ రాజకీయాల్లో మాత్రం అలా కాదు. ఆయన సీఎం అయ్యే స్థాయి ఆయనకు లేదు’ అని అన్నారు. రాజకీయాల్లో రాణించలేరని.. సీఎం కాలేరన్న జేసీపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
రాజకీయంగా పవన్ కు అంత సీన్ లేదనే అనుకుంటే.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబుకు మంతనాలు ఎందుకు చేసుకున్నట్లు? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ రాజకీయాల్లో రాణించరన్నదే నిజమే అయితే.. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారం చేయించుకుంటుంటే.. అవసరం లేదన్న మాట అప్పట్లోనే జేసీ చెబితే బాగుంటుందని.. అలా కాకుండా ఇప్పుడు చెప్పటంలో అర్థం లేదంటున్నారు. తమను తప్పు పట్టిన వారి సీన్ ను తగ్గించేయటం జేసీ లాంటోళ్లకు మామూలేనని పవన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/