ప్రస్తుతం రాష్ట్రంలో నంద్యాల ఉప ఎన్నిక వేడి తీవ్రంగా ఉంది. ఈ ఎన్నికల్లో తామంటే తామే విజయం సాధించాలని అధికార టీడీపీ - విపక్షం వైసీపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక, అధికార పార్టీ అయితే, ఉన్న అధికారాన్ని మొత్తం అడ్డం పెట్టుకుని నంద్యాల గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తోంది. ఇటీవల చంద్రబాబు నంద్యాలలో మాట్లాడుతూ ఓటుకు ఐదు వేల విషయం వెలుగులోకి తెచ్చారు. అంటే.. ఓట్లను కొనే అవకాశం ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఆయన పార్టీకే చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. కూడా ఎన్నికల్లో ప్రలోభాలు కామనేని అన్నారు.
అంటే గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో దూసుకుపోవాలని, దీనికోసం ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా తప్పులేదని సెలవిచ్చారు. అంతేకాదు, ఇదేమీ నెహ్రూ - గాంధీ కాలం కాదని తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. సో.. ఇదంతా నంద్యాల ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఆయన చెప్పారని అంటున్నారు విశ్లేషకులు. ఎన్ని ప్రలోబాలకు టీడీపీ పాల్పడినా తప్పులేదు అనే కోణంలోనే జేసీ మాట్లాడారని అంటున్నారు. ఇక, చంద్రబాబుపై నా జేసీ పరోక్షంగా ఫైరయ్యారు. అనంతపురానికి నీళ్లు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. నీళ్లు ఇవ్వకపోతే.. తానే కట్టలు తెంపేసి ప్రజలకు నీళ్లు అందిస్తానన్నారు.
అదేసమయంలో తన రాజకీయ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ.. తాను ఇక 2019 ఎన్నికల్లో పాల్గొనబోనన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు చెప్పారు. అయితే, తన తనయుడిని పొలిటికల్ అరంగేట్రం చేయించే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అదేసమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కి పదవి ఎందుకు పోయిందో.. ఆయన మాజీ ఎందుకయ్యారో కూడా చెప్పుకొచ్చారు. పల్లెకి నోట్లో నాలుకలేదని, అందుకే ఆయన అందరినీ సంతృప్తి పరచలేకపోయారని, అందుకే పదవి పోయిందని జేసీ తన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఎన్నికల్లో ప్రలోబాల గురించి చేసిన కామెంట్ హైలెట్!