ఆ ఛోక్రా కోసం రాజీనామా చేస్తానా?:జేసీ

Update: 2018-07-21 11:50 GMT
గ‌త రెండు రోజులుగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి `రాజీ` నామా ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. అనంత‌పురంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ ప‌నుల విష‌యంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరితో జేసీకి విభేదాలు వ‌చ్చాయ‌ని, దాంతో జేసీ రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నార‌ని పుకార్లు వ‌చ్చాయి. దీంతో, జేసీని బుజ్జ‌గించేందుకు సీఎం చంద్రబాబు....ప్ర‌భాక‌ర్ చౌద‌రితో భేటీ అయి....రహదారుల విస్తరణకు రూ. 45 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. అయితే, జీవో విడుద‌లైన‌ప్ప‌టికీ జేసీ రాజీనామా చేయాల‌నుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో నిన్న సాయంత్రం ఓ తెలుగు న్యూస్ చానెల్ ప్ర‌తినిధితో మాట్లాడిన జేసీ త‌న రాజీనామాతోపాటు - ఆ విస్త‌ర‌ణ ప‌నుల‌కు సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చాలా రోజుల నుంచే రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని అనుకుంటున్నాన‌ని అన్నారు.

ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు తాను సూట్ కానేమోన‌నిపిస్తోంద‌ని - ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని చూస్తే...మ‌తం - కులం - వ‌ర్గం అడ్డుప‌డుతున్నాయని - 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం ఉండి కూడా వాటికి బ‌ల‌వ్వాలా అనిపించింద‌ని జేసీ అన్నారు. తాను ఎక్క‌డా 10 రూపాయ‌లు ఆశించింది లేదని, దివాక‌ర్ రెడ్డి మాటిస్తే...త‌ప్ప‌క నెర‌వేరుస్తాడ‌నే న‌మ్మ‌క‌ముంద‌ని - దానిని వ‌మ్ము చేసుకోవ‌డం ఇష్టం లేకే గౌర‌వ‌ప్ర‌దంగా త‌ప్పుకుంటున్నాన‌ని అన్నారు.ఈ వ‌యసులో ఇన్ ఎఫిసియంట్ అనిపించుకోవ‌డం ఇష్టం లేద‌ని - అన్ని విష‌యాలు...సాధ్యాసాధ్యాలు బాగా తెలుసుకొన్న త‌ర్వాతే ప్రామిస్ చేస్తాన‌ని చెప్పారు. రోడ్ల వెడ‌ల్పు - ఫ్లై ఓవ‌ర్లు - ప‌ది మందికి అవ‌స‌ర‌మైన శానిటేష‌న్ - పేద‌ల‌కు ఇళ్లు వంటి కార్య‌క్రమాల‌ను తాను చేప‌ట్టినా కొంత‌మందికి ఇబ్బంది క‌లుగుతోంద‌ని, మునిసిపాలిటీకి రావాల్సిన 10 రూపాయ‌లు తింటున్నార‌ని నిల‌దీసినా ఇబ్బందేన‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విష‌యాల‌ను త‌మ పార్లీ అధినేత దృష్టికి తీసుకెళ్లాన‌ని అన్నారు.

వాట్ ఈజ్ హీ....ఎవ‌రో ఛోక్రా....దారిన పోయే కుక్క మొరిగితే తాను బెదురుతానా? అని జేసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఒక్క జీవో కోస‌మే...నా 40 ఏళ్ల రాజ‌కీయ జీవితాన్ని ప‌ణంగా పెడ‌తానా? అని జేసీ ప్ర‌శ్నించారు. ఆ విస్త‌ర‌ణ ప‌నుల జీవో 3 - 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉంద‌ని.....ఇపుడు బెదిరిస్తే జీవో జారీ చేశార‌నడం స‌రికాద‌ని అన్నారు. స‌్వ‌లాభం కోసం తాను ఏదైనా చేస్తే త‌ప్ప‌ని....ప్ర‌జ‌ల కోసం అవ‌స‌ర‌మైతే ఎవ‌రినైనా ఎదిరిస్తాన‌ని,.....దానిని బ్లాక్ మెయిల్ అంటే తానేం చేయ‌లేన‌ని అన్నారు.  ప్ర‌జ‌ల కోసం 100 సార్లు రాజీనామా చేస్తాన‌ని....100 సార్లు చ‌స్తాన‌ని...100 సార్లు బ్రతుకుతాన‌ని జేసీ ఎమోష‌నల్ గా చెప్పారు. టీడీపీలో ఎమ్మెల్యేలుగా స‌క్సెస్ అయిన వారందరం....ఎంపీలుగా ఫెయిల్ అయ్యామ‌ని....సిట్ అండ్ స్టాండ్ గేమ్ లా ఎంపీల వ్య‌వ‌హారం మారింద‌ని అన్నారు. నిన్న పార్ల‌మెంట్ ద‌గ్గ‌ర మీడియా మిత్రులు తోసేయ‌డం వ‌ల్ల కింద‌ప‌డితే రాహుల్ వ‌చ్చి లేపారని....ఎస్పీజీ సిబ్బంది బ‌దులుగా మిమ్మ‌ల‌ను భ‌ద్ర‌తా సిబ్బందిగా నియ‌మించాల‌ని ఆ మీడియా ప్ర‌తినిధిని ఉద్దేశించి చ‌మ‌త్క‌రించారు.



Tags:    

Similar News