ఫ్రీ వద్దే వద్దంటున్న జేసీ

Update: 2016-06-13 07:37 GMT
కొద్దికాలంగా పెదవి విప్పని టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చాలాకాలం తరువాత నోరు విప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడి తనదైన శైలిలో కౌంటర్లేశారు.  సొంత ప్రభుత్వం చేపడుతున్న కొన్ని పథకాలపైనా ఆయన విమర్శలు చేశారు. ఉచిత పథకాలు అభివృద్ధికి నిరోధకంగా మారాయాని అన్నారు. రూపాయికి కిలోబియ్యం పథకం... ఫ్రీ కరెంటు వద్దని తాను చాలాకాలంగా సీఎం చంద్రబాబుకు సూచిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 200 దుబారా చేస్తున్నారని.. అలాంటివారికి రూపాయికే కిలోబియ్యం ఇవ్వడం అవసరమా అని జేసీ ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ వల్ల కూడా నష్టం జరుగుతోందని.. ఉచిత విద్యుత్ ఎత్తేసి దానికి ప్రత్యామ్నాయంగా మరో విధంగా రైతులకు లబ్ధి చేకూర్చాలని అన్నారు. వేరే రాయితీల రూపంలో రైతులకు లబ్ధి చేకూర్చాలే కానీ ఉచిత విద్యుత్ మాత్రం అవసరం లేదని ఆయన తేల్చేశారు.

మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారిన ముద్రగడ పద్మనాభం వ్యవహారంలోనూ జేసీ మాట్లాడారు. ముద్రగడ తీరును ఆయన తప్పుపట్టారు. పురుగు మందు డబ్బా పట్టుకుని బెదిరించడం.. ప్రజలను రెచ్చగొట్టడం ముద్రగడలాంటి సీనియర్ లీడర్ కు ఏమాత్రం కరెక్టు కాదని అన్నారు. కాగా జేసీ గతంలోనూ ప్రభుత్వ పథకాలపై పలుమార్లు మాట్లాడారు. ముఖ్యంగా ఉచిత పథకాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఫ్రీ కరెంటు వల్ల అధిక నీటి వినియోగం జరుగుతోందని... దారి తప్పుతోందని కూడా ఆయన గతంలో అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News