అవును ప్రాంతీయ పార్టీలు కుటుంబ ఆస్తే -జేసీ

Update: 2018-06-02 16:59 GMT
రాజకీయాల్లో వారసత్వం సాధారణమైపోయింది. అయతే.. వారసులుగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకోసం పాటుపడేవారు కొందరైతే.. అడ్డదారిన పదవులు అందుకుని అక్రమాలు చేసేవారు మరికొందరు. వారసులుగా రాజకీయాల్లోకి వచ్చినా ప్రజాక్షేత్రంలో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి ఏదైనా చేయాలని తపించేవారు కొందరైతే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక.. దొడ్డిదారిన పదవులు తీసుకుని మంత్రులయ్యేవారు మరికొందరు. ఏది ఏమైనా వారసత్వ రాజకీయాలన్నవి తప్పేమీ కాదన్న భావన అందరిలోనూ కనిపిస్తోంది. అయితే.. వారసులుగా వచ్చినా వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడమే అయ్యుండాలన్నది ప్రధాన సూత్రం. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
    
ప్రాంతీయ పార్టీల్లో వంశపారంపర్య పాలన ఉంటుందని, ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. ఇటీవల మహానాడులో ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని కావాలని, ఆయన కుమారుడు లోకేశ్‌ ముఖ్యమంత్రి కావాలని అన్న విషయం తెలిసిందే. అలాగే వైసీపీ అధినేత జగన్‌కు ఆయన తాత బుద్ధులే వచ్చాయని కూడా అన్నారు. తాజాగా ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
    
అనంతపురంలో జేసీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, మహానాడులో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తానెవరినీ తప్పుపట్టలేదని, జగన్‌ కుటుంబాన్ని దూషించలేదని అన్నారు.
Tags:    

Similar News