తెలుగుదేశం పార్టీలో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజేసిన రచ్చ హాట్ టాపిక్ గా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం టీడీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు స్పందించారు. వారందరిదీ ఒకటే మాట.. జేసీ తీరు సరికాదనేది. అందులోనూ వాళ్లంతా టీడీపీ పాత కాపులు. జేసీ ఏమో కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉండిన వ్యక్తి. ఆ పార్టీ పతనం అయ్యాకా టీడీపీ వైపు వెళ్లారు. ఒకసారి గెలిచారు, రెండోసారి జేసీ ఫ్యామిలీ జాయింటుగా ఓడింది.
ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గుకు వచ్చినా.. మిగతా వాళ్లంతా స్థానిక ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాలో సత్తా చూపలేకపోయినా, జేసీ పై మాత్రం విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వారు మరో అంశం గురించి కూడా హైలెట్ చేశారు. జేసీ ఆర్మీ పేరుతో నడుస్తున్న ఫేస్ బుక్ పేజీ పై టీడీపీ నేతలంతా విరుచుకుపడ్డారు.
ప్రభాకర్ రెడ్డి డబ్బులిచ్చి కొంతమందితో తమపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి పెయిడ్ ఫేస్ బుక్ పేజీలకు ధీటుగా తాము కూడా స్పందించగలమని వారు అంటున్నారు. ప్రభాకర్ రెడ్డి పది మందితో ఫేస్ బుక్ పోస్టులు పెట్టిస్తే, తాము వంద మందితో పెట్టించగలమని, ప్రభాకర్ రెడ్డి వంద మందితో ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టిస్తే, తాము వెయ్యి మందితో పోస్టు చేయిస్తామంటూ వారు సవాళ్లు విసురుతున్నారు.
ఇంతకీ జేసీ ఫేస్ బుక్ పేజీల్లో ఏం పోస్టు చేస్తున్నారంటే.. అందులో టీడీపీ నేతలే లక్ష్యంగా పోస్టులు ఉంటున్నాయి. టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని అనడంతో పాటు.. కొంతమంది టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు కూడా ఆ పేజీల్లో పోస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి 250 ఎకరాల భూములున్నాయని, వాటిని కాపాడుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారంటూ కూడా ఆ పోస్టుల్లో ఆరోపిస్తున్నారు.
ఈ పోస్టులపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటున్నారు. మొత్తానికి డైరెక్టుగా తన వ్యాఖ్యలతోనే గాక.. తమ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా జేసీ ఫ్యామిలీ టీడీపీలో రచ్చ రేపుతున్నట్టుగా ఉంది!