రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ ముద్ర వేసుకున్న అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ ఎప్పుడూ.. ఏదొ ఒక విషయంతో రాజకీ యాల్లో హాట్ టాపిక్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. అసంతృప్తి.. కాకుంటే.. మరో వివాదం.. ఇలా.. నిత్యం జేసీ బ్రదర్స్ తమ దైన శైలిలో రాజకీయాలు చేస్తుంటారు.
తాజాగా సొంత పార్టీ నేతలపైనే.. జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై జేసీ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తాజాగా ఓడీచెరువు మండలం కొండకమర్లలోని మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ క్రమంలో టీడీపీ నేత సాకెం శ్రీనివాసరెడ్డితో కలసి వచ్చిన జేసీ ప్రభాకర్.. ఓ యూట్యూబ్ చానల్‌తో జేసీ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు మరకలున్న నాయకులేనని, వారందరినీ చంద్రబాబు మార్చాలని అన్నారు.
అంతేకాదు.. పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ మరకాలేని సాకెం శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉంటాడని, అతన్ని తాము బలపర్చు తున్నట్లు జేసీ చెప్పారు. అంతేకాదు.. పల్లె అవినీతి పాల్పడ్డాడని.. ఆయన వయసు కూడా అయిపోందని.. జేసీ వ్యాఖ్యానించడం గమనార్హం.
``నేను ఒకటి చెబుతా విను. ఇక్కడ టీడీపీ నేతలకు మైండ్ లేదు. ఉన్నా మనీపైనే ధ్యాస ఉంది. ఇలాంటి వారిని పట్టుకుని చంద్రబాబు సీఎం కాలేడు. అందరూ వేస్ట్. అందరినీ మార్చేయాలనేదే నా డిమాండ్. మార్చకపోతే.. అనుభవిస్తారు. మేం పార్టీ నాయకులమే. మాకు కూడా పార్టీ బాగుండాలనే ఉంది. కానీ.. ఇప్పుడున్న నాయకులను మార్చకుండా.. మాత్రం పార్టీ బాగుపడదని గట్టిగా నమ్ముతున్నాం`` అని జేసీ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘాటుగా స్పందించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తిలో టీడీపీని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘టిక్కెట్టు ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. తాడిపత్రిలో నీకు టిక్కెట్టు వస్తుందో, లేదో చూసుకో. ఇతర నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే పార్టీకి ప్రమాదం.
నేను ఇప్పటికి ఆరు సార్లు బీ ఫారం తీసుకున్నా. ఏడోసారి కూడా తీసుకుంటా’నని అన్నారు. అంతేకాదు.. పార్టీ బాగోగులు చూసుకునేందుకు చంద్రబాబు ఉన్నారని అన్నారు. పార్టీ మారే తత్వం ఉన్నవారికి ఇలాంటి ఆలోచలనే ఉంటాయని.. జేసీ బ్రదర్స్‌పై విరుచుకుపడ్డారు. ఏదేమైనా.. అనంతలో రాజుకున్న ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.