అసెంబ్లీకి పాకిన అవినీతి.. ఏకంగా 10 ల‌క్ష‌లు స్వాధీనం.. ఎక్క‌డంటే!

Update: 2023-01-06 14:30 GMT
ఇటీవ‌ల కాలంలో క‌ర్ణాటక ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో అవినీతి ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిం దే. ``40 ప‌ర్సెంట్ క‌మీష‌న్ స‌ర్కార్‌`` అంటూ ఇక్క‌డి బీజేపీ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ దు మ్మెత్తి పోస్తోంది. ఆధారాలు.. సాక్ష్యాల‌తో స‌హా.. కొన్ని కొన్ని అవినీతి కార్య‌క్ర‌మాల‌ను నిరూపిస్తోంది. ఏకంగా మంత్రిపైనే క‌మీష‌న్ ఆరోప‌ణ‌లు చేసిన కాంట్రాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.. కొన్నాళ్ల కింద‌ట క‌ల‌క‌లం రేపింది.

ఇక‌, ఇప్పుడు ఈ అవినీతి.. ఏకంగా అసెంబ్లీ వ‌ర‌కు పాకింది. కర్ణాటక  అసెంబ్లీ గేట్ వద్ద భారీ మొత్తంలో నగదును పోలీసులు పట్టుకున్నారు. ఒక ప్రాజెక్టుకు సంబంధించి ముడుపులు ఇచ్చేందుకు ప్రజాపనుల శాఖ జూనియర్ ఇంజినీర్ జగదీశ్ బ్యాగ్లో రూ.10 లక్షలతో వ‌చ్చిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంజ‌నీరుని అదుపులోకి తీసుకున్నారు. దీనివెనుకేం జ‌రిగింద‌నే విష‌యంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మాట‌ల యుద్ధం..

జ‌రిగిన విష‌యాన్ని రాజకీయంగా వాడుకునేందుకుఅ ధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ శక్తివంచ‌న లేకుం డా ప్ర‌య‌త్నించాయి. తాజాగా రూ.10 ల‌క్ష‌లు దొరికిన  ఘటనపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిపక్షాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.  "ఓ ఇంజనీర్ భారీ మొత్తంలో నగదును తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించి.. అతడిని పట్టుకున్నారు. అతడు నగదును ఎవరికోసం ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని కచ్చితంగా శిక్షిస్తాం`` అన్నారు.

అంతేకాదు..``రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకుముందు పుట్టరంగశెట్టి కార్యాలయంలో రూ.25 లక్షలు దొరికినప్పుడు అధికారంలో ఉన్న ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? నగదును తీసుకెళ్తున్నవారిని, తీసుకున్నవారిని పట్టుకున్నారా? మంత్రిని సస్పెండ్ చేశారా? ఈ విషయం గురించి ఆయన మర్చిపోయినట్లున్నారు.

అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు. బహుశా ఆయనకు మతిమరుపు ఉండవచ్చు. రూ.10 లక్షల నగదులో 40శాతం వాటా మాకు ఉంటే.. రూ.25 లక్షలు దొరికిన సమయంలో ఆయన వాటా ఎంత?" అని సీఎం వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. ఈ 10 ల‌క్ష‌లు అవినీతి సొమ్మేన‌ని అర్ధ‌మైపోయిందని అంటున్నాయిప్ర‌తిప‌క్షాలు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News