రాహుల్ ఒక ఇడియట్.. మోడీ మోసకారి.. !!

Update: 2019-09-23 07:28 GMT
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు జస్టిస్ మార్కెండేయ కట్జూ. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ గా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం ఎలాంటి పదవిలో లేరు. కాకుంటే.. తన వ్యాఖ్యలతో గతంలో మీడియాలో తరచూ ప్రముఖంగా కనిపించే ఆయన.. ఇటీవల కాలంలో కాస్త కామ్ గా ఉంటున్నారు.

తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో సంచలన పోస్ట్ ఒకటి పోస్ట్ చేశారు. దేశంలోని అధికార.. ప్రతిపక్ష పార్టీలకు కీలక నేతలుగా ఉన్న మోడీ.. రాహుల్ ను టోకుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ మోసకారిగా పేర్కొన్న ఆయన.. రాహుల్ గాంధీని ఒక ఇడియట్ గా అభివర్ణించారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత దేశానికి ఫ్రెంచ్ విప్లవం లాంటిది అవసరమని వ్యాఖ్యానించారు.  అంతేకాదు.. ప్రస్తుతం దేశం చీకట్లో ఉంటే.. హోస్టన్ లో వెలుగులు అద్భుతమంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన తాజా ట్వీట్ తో ఆయనలోని విమర్శకుడు నిద్ర లేచాడా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రానున్న రోజుల్లో ఆయన పోస్ట్ చేసే ట్వీట్లు.. ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి.


Tags:    

Similar News