మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, శాంతి దూత కేఏ పాల్ ఎక్కడా తగ్గట్లేదు. మునుగోడు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూ... నవ్వులు తెప్పిస్తున్నారు. 6 నెలల్లో మునుగోడును అమెరికా చేసి పడేస్తా అన్న కేఏ పాల్...తాజాగా `వార్ వన్ సైడే`` అని వ్యాఖ్యానించారు. ఆ మూడు పార్టీలకు కనీసం డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. వాస్తవానికి మునుగోడులో పోటీ చేస్తున్న పాల్‌కు ఆదిలో పెద్ద దెబ్బే తగిలింది. తన పార్టీ ప్రజాశాంతి పార్టీ తరఫున వేసిన నామినేషన్ చెల్లదని ఈసీ ప్రకటించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
అయినా.. ఎక్కడా ఆయన జంకడం లేదు. ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అయితే పాల్ ఇచ్చే హామీలు... ప్రజలకు మాత్రం నవ్వులు తెప్పిస్తు న్నాయి. మొన్నటికి మొన్న... 6నెలల్లో మునుగోడును అమెరికాను చేసి పడేద్దాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా మంగళవారం ఆయన మునుగోడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి... స్వీట్లు పంపిణీ చేశారు. చాయ్ పెట్టి ప్రజలకు టీ తాగించారు. అంతేనా సెలూన్ షాప్కు వెళ్లి కటింగ్ చేయించుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఆయన ఏం చేసినా.. మీడియాను పిలిచేస్తున్నారు. మీడియా మధ్యే ఉంటున్నారు. అదేం చిత్రమో.. మీడియా కూడా ఆయనను ఫాలో అవుతోంది.
ఈ సందర్భంగా పాల్ ఏమన్నారంటే.. ''60 సంవత్సరాల్లో లేని అభివృద్ధి 6నెలల్లో చేసి పడేస్తా.. నేను చేశాననే కేసీఆర్ అన్నారు. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ ఎస్ అయినా మనకే మద్దతు ఇస్తున్నారు. 6 నెలల్లో ఒక మండలానికి కాలేజీ, ఉచిత ఆసుపత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇచ్చి... 6నెలల్లో మునుగోడును అమెరికాను చేసి చూపిస్తా. 60శాతం అల్రెడీ డిసైడ్ చేశారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించడానికి.. ఇంకా కష్టపడితే ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. వార్ వన్సైడ్ అయిపోయిందనే... టీఆర్ ఎస్ గుండాలు, కాంగ్రెస్ గుండాలు అడ్డుకుంటున్నారు.'స - అని పాల్ చెప్పేస్తున్నారు. మొత్తానికి ఆయన మాటలు ఎలా ఉన్నా.. ఆయన ధీమా చూస్తే.. మాత్రం నవ్వాగడం లేదుకదా!!