మునుగోడులో ఓ వైపు టీఆర్ఎస్ గెలుస్తుందా? బీజేపీ విజయం సాధిస్తుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే.. ఈ ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ కమెడియన్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాత్రం అందరినీ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. మునుగోడులో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య అని తేలినా కూడా కేఏ పాల్ ఎక్కడా తగ్గడం లేదు.
మునుగోడు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్ ఆదినుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. మిగతా నేతలు తమకు ఎన్ని ఓట్లు వస్తున్నాయనే ఉత్కంఠతో ఉంటే మాత్రం.. కేఏ పాల్ తగ్గేదేలే అంటూ తొడగొడుతుండడం అందరినీ నవ్వులు పూయిస్తోంది. పాల్ తెలిసి చేస్తున్నాడా? తెలియక చేస్తున్నాడా? తెలియదు కానీ ఆయన చేష్టలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
కేఏ పాల్ తను ఓడిపోతున్నానని తెలిసినా కూడా ఇప్పటికే తన విజయోత్సవ ర్యాలీ కోసం పోలీసుల అనుమతి కోరడం విస్తుగొలిపేలా చేస్తోంది. కానీ కేఏ పాల్ విజయోత్సవ ర్యాలీకి పోలీసులు నిరాకరించినట్టు తెలుస్తోంది.
మునుగోడులో తాను 50వేల మెజార్టీతో గెలవబోతున్నట్టు కేఏ పాల్ ప్రకటించారు. కానీ ఆయనకు తొలి రౌండ్ లో వచ్చిన ఓట్లు కేవలం 34 మాత్రమే కావడం విశేషం. మరి ఈ డిపాజిట్ దక్కని కేఏ పాల్ విజయోత్సవ ర్యాలీ ఎలా చేస్తాడని అందరూ సెటైర్లు వేస్తున్నారు.