ఈవీఎంలు వ‌ద్ద‌ని చెప్పా.. న్యాయ‌పోరాటం చేస్తా: పాల్‌

Update: 2022-11-06 16:42 GMT
తెలంగాణలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉపఎన్నికల ఫలితాలపై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షులు, పొలిటిక‌ల్ క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్న కేఏ పాల్ స్పందించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారంటూ విమర్శించారు. ఈ ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌ పేపర్లతో జరపాలని కోరినప్పటికీ ఈసీ స్పందించలేదని విమర్శించారు. ఎన్నికల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని కేఏ పాల్‌ వెల్లడించారు. ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయింద‌ని.. దీనికి మునుగోడు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

విద్యావంతులు, మ‌హిళ‌లు.. అంద‌రూ త‌న వెంటే ఉన్నార‌ని చెప్పారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు 60 శాతం ఫ‌లితాలు వెల్ల‌డించార‌ని, కానీ, త‌న‌కు మాత్రం ఓట్లు రాలేద‌ని, అయితే.. కౌంటింగ్ నిర్వ‌హించిన అన్ని కేంద్రాల్లోనూ త‌న‌కే ఓట్లు ప‌డ్డాయ‌ని.. ఓటేసిన యువ‌త‌, మ‌హిళ‌లు చెప్పార‌ని అన్నారు. అంతేకాదు.. అధికారులు కూడా తాను గెలుస్తున్న‌ట్టు చెప్పార‌ని, ఎందుకంటే వారు ప్ర‌త్య‌క్షంగా ఓట్లు చూశార‌ని.. పేర్కొన్నారు.

ఉపఎన్నిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయని పాల్ త‌న‌దైన శైలిలో ఆరోపించారు. మద్యం, డబ్బుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలతో కాకుండా.. ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో జరపాలని కోరినప్పటికీ ఈసీ స్పందించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలలో భారీ స్థాయిలో ప్రలోభాలు జరిగాయని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని కేఏ పాల్ తెలిపారు.

 "బ్యాలెట్ పేపర్లు పెట్టండి.. ఈవీఎంలు వద్దని చెప్పాం. పోలింగ్ జ‌రిగి వెంటనే లెక్కపెట్టండని చెప్పాం. వీటిని సెంట్రల్ ఫోర్స్తో నడపమని చెప్పాం. కలెక్టర్, ఎస్పీ, ఆర్వో వారందరూ కేసీఆర్కు చెందిన వారు. ఇదంతా ప్లాన్గా జరిగింది. 3వతేదీన ఎలక్షన్ జరిగింది. 4వతేదిన కౌంటింగ్ చేయలేదు. ఖచ్చితంగా అవినీతి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయి. ఇవి అవినీతి ఎన్నికలు. ఈ ఎన్నికలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలి. మొత్తం 47 మంది అభ్యర్థులలో 37 మంది కోరుకుంటున్నారు. అయినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. నైతికంగా నాదే విజ‌యం`` అని పాల్ వ్యాఖ్యానించారు..
Tags:    

Similar News