వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐని కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిలదీయటం ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని అరెస్టు చేయాలి ? ఎవరిని విచారించాలనే విషయాన్ని సీబీఐ చూసుకుంటుంది. ఇదే కేసులో గతంలో చాలామందిని విచారించింది సీబీఐ. అయితే కొందరిని మాత్రమే అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టింది. తాజాగా పులివెందుల కోర్టుకు శంకర్ రెడ్డిని తీసుకొచ్చినందుకు సీబీఐని ఎంపీ నిలదీయటమే విచిత్రంగా ఉంది.
అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న శంకర్ రెడ్డిని అరెస్టు చేయడం ఏమిటంటు ఎంపీ సీబీఐని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని శంకరరెడ్డే కోర్టులో చెప్పుకోగలరు. దానికి ఎంపీ వత్తాసు అవసరం లేదు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించింది. ఆ తర్వాత కడపకు తీసుకొచ్చి మళ్ళీ వైద్యపరీక్షలు చేయించింది. ఆ తర్వాత మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టింది.
శంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో ప్రవేశపెట్టే ముందు రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించిన విషయం ఎంపీ గమనించాలి. విచారణకో లేకపోతే అరెస్టుకో సీబీఐ ప్రయత్నిస్తోందని తెలియగానే నిందితులు అనారోగ్యం పేరుతో వెంటనే ఆసుపత్రిలో చేరటం మామూలైపోయింది. వేలాది కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐకి శంకర్ రెడ్డి వ్యవహారం ఏమీ కొత్తకాదు. అందుకనే ఆసుపత్రిలో ఉన్నప్పటికీ అరెస్టు చేసింది.
తనకు అనారోగ్యంగా ఉంటే అదే విషయాన్ని శంకర్ రెడ్డి కోర్టులో చెప్పుకుంటారు కానీ మధ్యలో ఎంపీకి వచ్చిన సమస్యేంటో అర్థం కావటంలేదు. ఏదేమైనా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్టు చేయటంలో సీబీఐ గట్టిగానే వ్యవహరిస్తోంది. ఎంపీ పులివెందుల కోర్టులో చేసిన నిర్వాకంతో జనాల దృష్టిలో అనుమానాలు రావడం తప్ప ఇంకేమీ జరిగేదేమీ ఉండదు. ఇప్పటికే వివేకా హత్య కేసులో ఎంపీ హస్తం కూడా ఉందని డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి వాగ్మూలంలో ఉంది.
నిజానికి సీబీఐ విచారణకు ఎంపీ ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. మద్దతుదారులను కాపాడాలని ఎంపీ అనుకోవడం తప్పుకాదు. కానీ అందుకు సీబీఐని నిలదీయటం మాత్రం కరెక్ట్ కాదు. నిందితుల తరపున కోర్టులోనే కేసు వేసి వాదనలు వినిపించాలి కానీ తనిష్టం వచ్చినట్లు చేస్తానంటే ఎవరు అంగీకరించరని ఎంపీ గ్రహించాలి.