తెలంగాణ రాష్ట్ర సర్కారు షురూ చేసిన ప్రాజెక్టు రీడిజైనింగ్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసేం. తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి డీపీఆర్ తాజాగా బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదికను తయారు చేయటానికి వాప్కెస్ సంస్థకు అప్పగించింది. తాజాగా ఆ పథకానికి సంబంధించిన డీపీఆర్ ను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది.
ఇందులోని కొన్ని అంశాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టు లాభమేనన్న విషయాన్ని తేల్చినప్పటికీ.. నిర్వహణ ఖర్చుల లెక్క చూసినప్పుడు వామ్మో.. అనుకునేలా ఉండటం గమనార్హం. ఈ ఎత్తిపోతల పథకానికి విద్యుత్తు సరఫరా ఖర్చు ఏడాదికి రూ.4067.4కోట్లుగా లెక్క కట్టారు. ఇక.. నిర్వహణకు మరో రూ.110.8కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వాస్తవానికి ఖర్చుల లెక్కల అంచనాకు.. వాస్తవానికి మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆరు విభాగాల డీపీఆర్ లను ప్రభుత్వానికి అందించింది. తాజా రిపోర్ట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం రూపాయి ఖర్చు చేస్తే.. అంతిమంగా రూపాయిన్నర ఆదాయం వస్తుందని తేల్చింది. వ్యాపార లెక్కల ప్రకారం చూస్తే.. ఈ ఆదాయం ఆకర్షణీయమైనదే. అయితే.. అంచనాలకు తగ్గట్లే వాస్తవం ఉంటుందా? అన్నది ఒక పెద్ద ప్రశ్నగా చెప్పొచ్చు. చిన్న.. చితక ప్రాజెక్టు అయితే.. కాస్త అటూఇటూ అయినా ఫర్లేదు. కానీ.. భారీ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ఇష్యూలో ఏ మాత్రం తప్పులు దొర్లినా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదనే చెప్పాలి.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ లో పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాల్ని చూస్తే..
= ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు జల్లాల్లోని 1581 గ్రామాల ఆయుకట్టుకు నీరు అందుతుంది.
= మేడిగడ్డ నుంచి 180 టీఎంసీల నీటిని మళ్లించటం.. భూగర్భ జలం.. ఎల్లంపల్లి నుంచి 20టీఎంసీలు.. మొత్తంగా 225 టీఎంసీల నీటి వినియోగం జరుగుతుంది.
= ఇప్పటికే 55.9 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలశయాలు ఉండగా.. కొత్తగా 147.7 టీఎంసీలసామర్థ్యం ఉన్న 20 జలాశయాల్నినిర్మిస్తారు. కొత్త జలాశయాల్లో వినియోగ సామర్థ్యం 125 టీఎంసీలు.
= జలాశయాల కింద 8298 కుటుంబాలు ముంపునకు గురి అవుతాయి. పునరావాసం కింద 7056 ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది.
= ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్ లో 7.38లక్షల హెక్టార్లు.. రబీలో 2.22లక్షల హెక్టార్ల ఆయుకట్టు సాగులోకి తేవటమే లక్ష్యం.
= కాళేశ్వరం కోసం ఏర్పాటు చేసే 82 పంపులకు ఏడాదికి 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం
= ఈ ప్రాజెక్టుకానీ సాకారమైతే.. ప్రస్తుతం హెక్టారుకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంటే.. ప్రాజెక్టు పూర్తి అయితే ఈ దిగుబడి 50 క్వింటాళ్లకు పెరుగుతుంది. అదే రీతిలో కూరగాయలు ఏడుక్వింటాళ్లుగా ఉన్న ప్రస్తుత పరిస్థితి నుంచి ప్రాజెక్టు పూర్తి అయితే 60 క్వింటాళ్లకు పెరుగుతుందన్నది అంచనా. మొత్తంగా ఇప్పుడొస్తున్న దిగుబడి కంటే ఐదారు రెట్ల ఎక్కువ దిగుబడి పెరుగుతుందంటూ డీపీఆర్ అంచనా వేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/