అందుకే లేట్ అంటున్న కమల్

Update: 2018-01-11 17:07 GMT
సూపర్ స్టార్ రజనికాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక అందరి చూపు లోక నాయకుడు కమల్ హాసన్ మీదే ఉంది. నిజానికి రజని కంటే ముందే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తాను అని ప్రకటించింది కమల్ హాసనే. కాని యేవో కారణాల వల్ల ప్రకటన వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ స్పష్టత లేకుండా దాటవేస్తున్న కమల్ తాజాగా ఒక ప్రముఖ తమిళ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉందని, కాని దాని వెనుక అవసరమైన ప్రణాళిక వేసుకోవడంలో బిజీగా ఉండటం వల్లే తొందరపడటం లేదని వివరణ ఇచ్చాడు. రాజకీయాల్లో విమర్శలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, వాటికి బాధ్యత వహించేందుకు సిద్ధ పడే ప్రయత్నాల్లో ఉన్నానని  చెప్పిన కమల్ తాను ఏ లోపు ప్రవేశిస్తాను అని మాత్రం చెప్పలేదు.

పోటీదారు హీరోగా ఉన్న సినిమా మనకంటే విడుదల అవుతున్నప్పుడు తొందర పడతామని కాని రాజకీయాల్లో అలా కుదరదని రజనితో పోలిక గురించి నర్మగర్భంగా చెప్పిన కమల్ తన స్నేహితుడి ఎంట్రీ గురించి మాత్రం మాట జారకుండా జాగ్రత్త పడ్డాడు. తనను నమ్మే వాళ్ళు కాని అనుచరులు కాని అభిమానులు కాని తలదించుకునే పని చేయనన్న కమల్ తాను వేసే అడుగు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ రంగంలోకి దూకుతాను అంటున్నాడు. పార్టీ పెడతారా లేక ఏదైనా కూటమికి మద్దతు ఇస్తారా అనే దాని గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు కమల్. సినిమాల విషయంలో కూడా కమల్ కు సందిగ్దత నెలకొంది. విశ్వరూపం 2 రిపబ్లిక్ డే కు తెస్తానన్న కమల్ కనీసం టీజర్ వదిలే సూచనలు కూడా లేవు. శబాష్ నాయుడు షూటింగ్ కొంత బాలన్స్ మిగిలి పోయింది. దాని గురించి ఊసు లేదు. ఇలా రెండు విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన కమల్ వీలైనంత త్వరగా స్పష్టత ఇస్తే బెటర్.
Tags:    

Similar News