తమిళులు బాగా జరుపుకునే పండుగల్లో పొంగల్ ఒకటి. పండుగ వేళలోనే ప్రముఖ నటుడు.. ఈ మధ్యనే రాజకీయాల్లో సీరియస్ గా పని చేస్తున్న కమల్ హాసన్ పార్టీకి గుర్తు కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కమల్ స్వయంగా ప్రకటించారు. ఆయన ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించినట్లుగా కమల్ వెల్లడించారు.
మరికొద్ది నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కమల్ హాసన్ పార్టీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో అన్నిచోట్ల ఒకే గుర్తు ఉండేలా కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయనకు టార్చిలైట్ ను కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు ఆయన పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
ప్రజా న్యాయ కేంద్రం (మక్కల్ నీది మయ్యం) పేరుతో ఏర్పాటు చేసిన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైట్ కేటాయించిన నేపథ్యంలో.. ఆయన పార్టీ అభ్యర్థులంతా ఒకే పార్టీ గుర్తుపై పోటీ చేసే వీలుంది. మరి.. తమిళనాడు రాజకీయాల్లో కమల్ టార్చిలైట్ వెలుగులు ఏ మేరకు ప్రసరిస్తాయో చూడాలి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన నేపథ్యంలో ఆయన పార్టీతో జత కట్టేందుకు కమల్ ఆసక్తిని కనబర్చారు. అయితే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న విషయంపై రజనీ వెనక్కి తగ్గటం తెలిసిందే.