అమెరికా చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని ఒక పరిస్థితి ట్రంప్ హయాంలో చోటు చేసుకుందని చెప్పాలి. వైరస్ కావొచ్చు.. యుద్ధం కావొచ్చు.. మరేదైనా కావొచ్చు.. ఒక ఎపిసోడ్ కు సంబంధించిన అత్యధిక అమెరికన్లు ప్రభావితం కావటం.. ప్రాణాలు కోల్పోవటం అన్నది కరోనా వేళలోనే అని చెప్పాలి. తనకు నచ్చని దేశంపై కాలు దువ్వే అగ్రరాజ్యం.. తన ఆగ్రహావేశాలకు సదరు దేశాలు దారుణమైన మూల్యం చెల్లించే పరిస్థితి. అందుకు భిన్నంగా అక్కడెక్కడో చైనాలోని వూహాన్ లో పుట్టిన కొవిడ్ -19 మాత్రం.. అమెరికాను అతలాకుతులం చేసిందన్నది మర్చిపోకూడదు.
కరోనా మహమ్మారి కారణంగా అమెరికన్లు కిందామీదా పడుతున్న వేళలోనే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగటం దేశాధ్యక్షుడు ట్రంప్ కు ఇప్పుడో తలనొప్పిగా మారింది. కరోనాతో దారుణమైన అనుభవాల్ని చూసిన అమెరికన్లు.. తాజాగా జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ట్రంప్ కు వైరిపక్షంగా నిలిచన డెమొక్రాట్లు.. అనూహ్యంగా ఉపాధ్యక్ష పదవికి భారత-ఆఫ్రికన్ మూలాలు ఉన్న కమలా హ్యారీస్ ను అభ్యర్థిగా ప్రకటించటం తెలిసిందే. ఈ నిర్ణయంపై ట్రంప్ ఎంతలా విరుచుకుపడ్డారో.. మరెంతటి తీవ్ర వ్యాఖ్యలు చేశారో తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కరోనా వ్యాక్సిన్ పై అమెరికన్లలో కొత్త ఆశలు పుట్టించేలా ప్రయత్నిస్తున్నారు ట్రంప్. ఈ అక్టోబరు నాటికి వ్యాక్సిన్ వచ్చేస్తున్నట్లేనని చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఓట్లు రాల్చుకోవాలన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లుగా చెప్పాలి. దీనికి ఘాటైన కౌంటర్ ఇచ్చారు కమలా హ్యారీస్. కరోనా వ్యాక్సిన్ అక్టోబరులో అందుబాటులోకి రావొచ్చని ట్రంప్ చెబుతున్న మాటల్ని తాను నమ్మనని.. ఆమె వెల్లడించారు.
వ్యాక్సిన్ సమర్థత.. పనితీరుపై విశ్వసనీయ సమాచారం ఉంటే తప్పించి.. ట్రంప్ మాటల్ని తాను నమ్మనని చెప్పిన ఆమె.. కరోనా కారణంగా అమెరికాకు జరిగిన నష్టాన్ని ఏకరువు పెట్టారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ 1.91 లక్షల మందికి పైనే అమెరికన్లు మరణించారని.. 63 లక్షల మంది ఈ వైరస్ బారిన పడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే వ్యాక్సిన్ పై ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. తానేదో చేశానని చెప్పటానికే ట్రంప్ ప్రయత్నిస్తున్నారని.. ఆయన మాటల్ని పట్టించుకోవద్దని ఆమె చెబుతున్నారు. మరి.. అమెరికన్లు ఎవరి మాటలు విన్నారు? ఎవరి మాట ప్రభావానికి లోనయ్యారన్న విషయం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని చెప్పక తప్పదు.