తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీజేపీ నాయకులు రోడ్డెక్కుతారు.. ఆందోళనలు చేస్తారు.. రాజకీయంగా లబ్ధి పొందుతారు. మరి దేశంలో 20 రాష్ట్రాలకు పైగా పాలిస్తున్న రాష్టాల్లో ఎందుకు విలీనం చేయలేదని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే నోరు మెదపరు.. మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు అన్నట్టు.. ఒక స్టాండ్ పై నిలబడని బీజేపీ ఎన్ని మాటలు అయినా అంటుంది. కానీ ఆచరణలోకి వచ్చే సరికి మాత్రం జారుకుంటుందని దాని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద.. కొన్ని ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాలు పంచే భవనాలకు తెలుగుదేశం పార్టీ వేసిన రంగులను వైసీపీ ఔత్సాహికులు మార్చేసి అధికార వైసీపీ రంగులు వేస్తున్నారు. వైఎస్ జగన్ పాలించినా ఇంకా ఆ పచ్చ పార్టీకి ఎందుకు ప్రచారం కల్పించాలని ఇలా అభిమానులు చేసి ఉండవచ్చు. దీన్నే జగన్ చేయించాడు అన్నట్టుగా బీజేపీ నేతలు చేస్తున్న వాదననే ఇప్పుడు అందరూ తప్పు పడుతున్నారు. ఒక రాష్ట్రానికి సీఎం అయిన జగన్.. సిల్లీగా ఇలా రంగులు మార్చమని అంటారా అన్న కనీస కామెన్ సెన్స్ లేకుండా టీడీపీతో పాటు బీజేపీ నేతలు జత కలిసి ఆరోపణలు చేయడమే విడ్డూరంగా ఉంది.
తాజాగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలా వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టారు. ఇదేదో పెద్ద ఘోరం - దారుణం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి ఇంత అరిచిగోల చేస్తున్న కన్నా లక్ష్మీ నారాయణకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు - ఆఖరకు రోడ్డు ట్యాక్స్ వసూలు చేసే టోల్ ట్యాక్స్ లకు కూడా మొత్తం కాషాయ రంగు పులిమిన సంగతి మరిచిపోయారా అని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి మరీ కడిగిస్తేన్నారు. ‘బీజేపీ చేస్తే సంసారం.. వైసీపీ చేస్తే వ్యభిచారామా కన్నా సారూ’ అంటూ పెట్టిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.