3 రాజధానులపై కన్నా లేఖ.. బీజేపీలో చిచ్చు..!!

Update: 2020-07-19 14:30 GMT
ఏపీకి మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించవద్దంటూ తాజాగా గవర్నర్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం బీజేపీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన లేఖను రాయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ మొన్నటి ఎన్నికల వేళ కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని పక్కనపెట్టడం పట్ల ప్రజల్లో ప్రతి కూల సంకేతాలు వెళ్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అంశంపై బీజేపీలో చిచ్చు మొదలైంది. బీజేపీ నేతల్లో భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ సహా సుజనా చౌదరి వంటి కొందరు నాయకులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉండగా.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, రాయలసీమకు చెందిన కొందరు నాయకులు దీన్ని స్వాగతిస్తున్నారు.ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వంటి మరికొందరు సీనియర్లు తటస్థ సీనియర్లు తటస్థ వైఖరిని అనుసరిస్తున్నారు.

ఇక మూడు రాజధానుల ఏర్పాటు చేసే అంశం రాష్ట్ర పరిధిలో ఉందని.. దాంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదంటూ జీవీఎల్ పేర్కొనడంతో కేంద్రం మద్దతు జగన్ ప్రభుత్వానికి ఉందని స్పష్టమైంది. ఇక కేంద్రంలోని మోడీషాలతోనూ జగన్ సత్సంబంధాలున్నాయి. దీంతో కేంద్రం కూడా జగన్ కు సహకరించేలానే ఉంది.

ఈ నేపథ్యంలోనే గవర్నర్ కు స్థానిక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సహా పలువురు ఒత్తిడి తేవడం కమలం పార్టీలో చిచ్చు పెట్టింది. సొంత పార్టీలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బీజేపీ రెండుగా చీలిపోయింది.
Tags:    

Similar News