రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులు చాలా విచిత్రంగా ఉన్నాయి. దేశంలోని మరే రాష్ట్రంలోను లేనంతగా పార్టీలనేతల్లో చాలామంది సామాజికవర్గాల వారీగా విడిపోయారు. సో పార్టీలకు తగ్గట్లే మీడియా కూడా చీలిపోయింది. మెజారిటి మీడియా అంటే సుమారు 90 శాతం మీడియా చంద్రబాబునాయుడు అండ్ కో కు వత్తాసు పలుకుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలంటే ప్రభుత్వాన్ని, అధికారపార్టీని వ్యతిరేకిస్తున్నాయంటే అర్ధముంది. కానీ మీడియా కూడా అలాగే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుత పరిస్దితుల్లో మీడియా నుండి బ్యాలెన్స్ ఆశించటం అత్యాసగా మారిపోయింది.
చంద్రబాబు మద్దతు మీడియా వ్యవహారం ఎలాగుంటుందంటే ప్రభుత్వాన్ని నూరుశాతం వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తోంది. కాబట్టి టీడీపీలో ఎంతచిన్న నేతలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా పెద్దగా హైలైట్ చేసేస్తోంది. అయితే ఇటువంటి పరిస్దితుల్లో చంద్రబాబు మీడియా అనుసరిస్తున్న ఓ వైఖరి కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీలో తిరుగుబాటు ఎంఎల్ఏలు నలుగురున్నారు. వీరిలో చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్, గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కమ్మ సామాజికవర్గం వాళ్ళు.
వీళ్ళిద్దరు చంద్రబాబు మీద తిరుగుబాటు చేసి మరీ వైసీపీకి మద్దతుగా నిలబడుతున్నారు. అయితే వీళ్ళు చంద్రబాబు మీద ఎంత తిరుగుబాటు చేసినా, వైసీపీకి మద్దుతుగా నిలబడిన కూడా వీళ్ళకు మద్దతుగానే వార్తలుంటున్నాయి. మామూలుగా అయితే చంద్రబాబు వ్యతిరేకులంతా ఈ మీడియాకు వ్యతిరేకులే. కానీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం ఎందుకో సదరు మీడియా చాలా పాజిటివ్ గా ఉంది. ఉదాహరణలు తీసుకుంటే చీరాల మత్స్యకార గ్రామాల్లో ఈమధ్య ఎంఎల్ఏ కరణంకు మాజీ ఎంఎల్ఏ, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మధ్య పెద్ద గొడవలే జరిగాయి.
నిజానికి గొడవలకు కరణం వ్యవహార శైలే కారణమని అందరు చెప్పుకుంటున్నారు. కానీ ఈ మీడియా మాత్రం కరణంను తప్పు పడుతు ఎక్కడా కథనాలు ఇవ్వలేదు. పైగా తప్పంతా ఆమంచిదే అన్నట్లుగా వార్తలు రాసింది. ఇక గన్నవరంలో ఎంఎల్ఏ వైసీపీకి మద్దుతుగా వ్యవహరిచటంతో సీనియర్ నేత యార్గగడ్డ వెంకట్రావుతో పెద్ద వివాదమే నడుస్తోంది. విషయం ఏమిటంటే ఇద్దరు కమ్మ నేతలే అయినా చంద్రబాబు మద్దతు మీడియా వంశీని మాత్రమే వెనకేసుకొస్తోంది. వంశీ వైసీపీతో అసోసియేట్ అవ్వటం వల్లే గొడవలవుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ మీడియా మాత్రం వంశీకి వ్యతిరేకంగా ఒక్క కథనం కూడా వండివార్చలేదు.
జరుగుతున్నది చూస్తుంటే వైసీపీలోని లేదా వైసీపీకి మద్దతుగా నిలబడుతున్న టీడీపీ కమ్మ నేతలకు మద్దతుగా నిలబడాలని చంద్రబాబు మీడియా డిసైడ్ అయ్యిందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అంటే కమ్మ నేతలు వైసీపీలో ఉన్నా పర్వాలేదు మనం మనం ఒకటే అన్న పద్దతిలో వ్యవహారాం నడుపుతున్నాయా అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. బహుశా వైసీపీలోని కమ్మ నేతల ద్వారా తమ పనులను ఏవైనా చక్క బెట్టుకునేందుకు ప్లాన్ చేస్తోందా అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. చూద్దాం ఈ మీడియా ప్లాన్లు ఏమిటో బయటపడకుండానే ఉంటుందా ?