ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం... ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిపోతున్నారా? ఎమ్మెల్సీ పదవి దక్కనందుకు బాబుపై కోపంతో ఆయన కండువా మార్చేందుకు సిద్ధమయ్యారా? త‌్వరలో ఫ్యాన్ పార్టీకి జంప్ కానున్నారా? అనే వార్తలకు క్లారిటీ వచ్చింది. మీడియాతో మాట్లాడుతూ కరణం బలరాం క్లారిటీ ఇచ్చారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి చేరేందుకు తాను సిద్ధమయినట్లు వస్తున్న వార్తలు అవాస్తమని కరణం బలరాం స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన వార్తలు బాధించాయని ఆయన అన్నారు. అసలు తనను వైసీపీలోకి రమ్మని అడిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. అన్నింటికీ మించి వైసీపీలో చేరాల్సిన అవసరం, అగత్యం తనకు లేదని కరణం బలరాం స్పష్టంచేశారు. పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని బలరాం చెప్పారు.
తాను ఇప్పటికే టీడీపీ ద్వారా పదవులు అనుభవించానని, అన్ని రకాల గౌరవం పొందానని తెలిపారు. తాను ఒక కులానికో..వర్గానికో ప్రతినిధి కానని....ప్రజాప్రతినిధిని అని కరణం బలరాం స్పష్టం చేశారు. తను తుదివరకు టీడీపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరిచేందుకు కొన్ని వర్గాలు కావాలని కుట్ర చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.