కరోనా వైరస్ జనాలను ఎంత భయపెడుతుందో తెలియజేసే సంఘటన ఇదీ.. కర్ణాటక లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడి ఇప్పటి కే ఓ వృద్ధుడు మరణించగా.. చాలా మందికి వైరస్ సోకింది. దీంతో బెంగళూరుకు దూరంగా దక్షిణ కన్నడ ప్రాంతం లో మూడబిదిరిలోని కరింజె ప్రైవేట్ భవనం లో కరోనా అనుమానితుల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కన్నడ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
ఈ మేరకు తహసీల్దార్ ఆ స్థల పరిశీలను వచ్చారు. శివారు ప్రాంతం లో ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించిన జిల్లా యంత్రాంగం కరింజె గ్రామంలో ఈ కరోనా వైరస్ బాధితుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అయితే ఈ కరోనా కేంద్రం గ్రామం లో ఏర్పాటైతే అందరికీ వ్యాపిస్తుందని.. తామంతా ఆత్మహత్య చేసుకుంటామని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇక్కడ కరోనా కేంద్రం ఏర్పాటు చేయడానికి వీల్లేదని చస్తామని రోడ్డుకెక్కారు.
తహసీల్దార్ ను అడ్డుకోవడంతో ఆయన ఇక్కడ కరోనా కేంద్రంపై కలెక్టర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అక్కడి నుంచి వెళ్లిపోయారు.