తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆకాశానికి ఎత్తేశారు. ఏకంగా ఆశోక చక్రవర్తితో తెలంగాణ సీఎంతో పోల్చేశారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు చాటేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దఫాలు విజయవంతంగా నిర్వహించిన హరితహారం మూడో దశకు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 12న కేసీఆర్ స్వయంగా కరీంనగర్ లో మొక్కలు నాటనున్న నేపథ్యంలో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అశోక చక్రవర్తిలా ఆలోచిస్తున్నారని ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలు నాటడమే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యమని కర్నె ప్రభాకర్ ఉద్ఘాటించారు. ఆనాడు అశోకుడు మొక్కలు నాటించిన రీతిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సైత ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పార్టీలు ప్రయోజనాలు పక్కన పెట్టాలని కోరారు. కాగా, 70 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసి దేశంలో పెద్ద పార్టీగా టీఆర్ ఎస్ అవతరించిందని కర్నె ప్రభాకర్ తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు, జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రజల్లో గందరగోళం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తమని ప్రజలు గుర్తించారని చెప్పారు.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పట్ల ప్రజల్లో గౌరవం తగ్గిందని ఆయన విశ్లేషించారు. అభివృద్ధి జరుగుతున్నప్పటికీ అవాస్తవ ప్రచారం చేస్తున్న ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారని కర్నె తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 10 వేల ఎకరాల భూమిని దళితులకు పంపిణీ చేశామని గుర్తు చేశారు. గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల కోసం వేసిన శిలాఫలకాలు వెక్కిరించినప్పుడు కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ నేతగా మాట్లాడుతున్నాడా? కల్వకుర్తి నేతగా మాట్లాడుతున్నాడా? అని అడిగారు. కల్వకుర్తి - 2, 3 లిఫ్ట్ పనులను తెలంగాణ ప్రభుత్వమే పూర్తి చేసిందని గుర్తు చేశారు.