టీఆర్ఎస్ పార్టీలో నేతలు ఎంతమంది ఉన్నా.. కొందరు మాత్రం నిత్యం మీడియాలో కనిపిస్తుంటారు. తమ అధినేత కేసీఆర్ మీద ఎవరేమన్నా.. ఈ టీం వెంటనే స్పందిస్తుంటుంది. మిగిలిన నేతలతో పోలిస్తే.. కొందరు యమా యాక్టివ్ గా ఉంటారు. పార్టీ పట్ల విపరీతమైన కమిట్ మెంట్ ను ప్రదర్శిస్తుంటారు. నిత్యం పార్టీ ఆఫీసుకు వచ్చి వెళుతుంటారు. తమ జీవితంలో ఎక్కువగా పార్టీకి కేటాయించే కొద్ది మంది నేతల్లో సీనియర్ నేత కర్నె ప్రభాకర్ ఒకరు.
రెండు రోజుల్లో ప్రారంభం కానున్న టీఆర్ఎస్ ప్లీనరీకి ఆయన మీడియా కో ఆర్డినేటర్ కూడా. ఇలాంటి సీనియర్ నేతకు.. తాజాగా పార్టీ ఆఫీసు వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఇంతకూ జరిగిందేమంటే.. ఆదివారం తెలంగాణ భవన్ వద్ద పార్టీ సమావేశం జరిగింది. దీనికి హాజరయ్యేందుకు ప్రత్యేకంగా పాసులు ఇచ్చారు. గుర్తింపు కార్డు.. పాసులు ఉన్నోళ్లను మాత్రమే లోపలకు అనుమతించాలన్న స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
అయితే.. ఈ విషయం మీద అవగాహన లేని ఆయన.. రోజు మాదిరే తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయన్ను గుర్తింపు కార్డును అడిగారు సెక్యురిటీ సిబ్బంది. అయితే.. తన గురించి ఆయన చెప్పినా.. లోపలకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో.. అసహనానికి గురైన కర్నె.. లోపలి వారికి ఫోన్ చేసి విషయం చెప్పటంతో.. వారు వచ్చి సెక్యురిటీకి చెప్పి లోపలకు తీసుకెళ్లారు. రోజువారీగా ఆఫీసుకు వచ్చే తనను గుర్తు పట్టని భద్రతా సిబ్బంది మీద ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.