విషయం ఏదైనా.. ఎదుటోడ్ని ఆవేశంగా తిట్టేసే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతల్లో కర్నె ప్రభాకర్ ఒకరు. సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నట్లే కనిపించే ఆయన.. తమ తప్పుల గురించి ఒక్క ప్రస్తావన చేయకుండా.. రాజకీయ వైరిపక్షం మీద మాత్రం దుమ్మెత్తిపోసేలా విమర్శలు చేస్తుంటారు. తెలంగాణలో భారీగా సాగుతున్న రైతుల ఆత్మహత్యల విషయంపై విపక్షాలు విరుచుకుపడటంతో.. ఇదే అంశం మీద పేపర్ వర్క్ చేసి.. భారీ గణాంకాలు తయారు చేశారు. మీడియా సమావేశం పెట్టి.. విపక్ష కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలను ఉతికి ఆరేసే కార్యక్రమం ఒకటి చేపట్టారు. అయితే.. ఆయన చెప్పిన లెక్క ఆయనకే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకంటే.. తమ హయాంలో జరిగిన ఆత్మహత్యల గురించి మాట మాట్లాడకుండానే.. కాంగ్రెస్ పాలన సాగించిన 19 సంవత్సరాల్లో దాదాపు 26 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డ ఆయన.. తొమ్మిదిన్నరేళ్ల టీడీపీ ముష్కర పాలనలో 10 నుంచి 12 వేల మంది వరకు మరణించారన్నారు. అలాంటి వారా? తమను ప్రశ్నించేదన్నది టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వాదన.
ఆయన మాటల్నే లెక్కలోకి తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారలో ఉన్న 19 ఏళ్ల కాలంలో 26వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కర్నె సెలవిచ్చారు. అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో 26 వేల మంది 19 ఏళ్ల కాలంలో అంటే.. ఏడాదికి 1368 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లోని రైతుల ఆత్మహత్యలు లెక్కగా తీసుకుంటే.. పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 15 నెలల్లో 1400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న విమర్శలకు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
అదే రీతిలో టీడీపీ హయాం గురించి కూడా కర్నె లెక్క కాకిలెక్కగా ఉందంటున్నారు. ఎందుకంటే.. టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య దాదాపు 10 వేల నుంచి 12 వేల మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. 10 నుంచి 12 వేల మధ్య వ్యత్యాసం 2వేల మంది. రైతుల ఆత్మహత్యలంటే ఎవో లెక్కలు కావు. మనుషుల ప్రాణాలు. అలాంటి ప్రాణాలు పోయిన అన్నదాతల గురించి మాట్లాడేటప్పుడు సుమారు.. దాదాపు లాంటి పదాలు ఉపయోగించటం ఏమిటన్నది ఒక ప్రశ్న. ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల సమాచారం గురించి మాట్లాడేటప్పుడు.. పాత రికార్డుల్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సరిపోయేది. అంతేకానీ.. విమర్శించాలన్న తొందరలో రెండు వేల తేడాతో విమర్శలు చేయటం కర్నెకు మాత్రమే సాధ్యమవుతుందేమో.