ఈ దేశానికి క‌ర్త‌-కర్మ‌-క్రియ మోడీనేనంటారా?

Update: 2022-12-14 05:32 GMT
ఔను.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇదే ప్ర‌శ్న హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఈ దేశానికి ఎంతో సేవ‌లు అందించారు. ఎంద‌రెంద‌రో.. త్యాగాలు చేసి మ‌రీ దేశం కోసం.. స‌ర్వంధార‌పోశారు.  దేశ ప్ర‌ధానులుగా ప‌నిచేసిన వారిలో రూపాయి జీతం కూడా తీసుకోనివారు ఉన్నారు. పార్ల‌మెంటుకు న‌డిచి వెళ్లిన వారు.. సైకిళ్ల‌పై వెళ్లిన వారు.. చివ‌ర‌కు రిక్షాల్లో వెళ్లిన వారు కూడా ఉన్నారు. వీరంతా దేశ ప్ర‌ధానులే. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త త‌న‌కు అవ‌స‌రం లేద‌న్న వీపీ సింగ్‌ను మ‌రిచిపోలేం. రూపాయి జీతం తీసోకోని లాల్ బ‌హదూర్ శాస్త్రిని ఈ జాతి ఇంకా మ‌రిచిపోలేదు.

కానీ, ఇప్పుడు మాత్రం మోడీనే దేశానికి క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ అంటూ.. బీజేపీ కొత్త ప‌లుకులు ప‌లుకుతుండ‌డ‌మే చిత్రంగా ఉంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. తాజాగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ సెక్టార్‌లో చైనా సైన్యం దూకుడుగా ప్ర‌వ‌ర్తించ‌డం, దీనిని భార‌త సైన్యం తిప్పికొట్ట‌డం తెలిసిందే.

నిజానికి తవాంగ్ వ‌ద్ద ఇవి ఎందుకు జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌శ్న‌కు ఇటు భార‌త్‌, అటు చైనా సైనికులు కూడా ఒక‌టే చెబుతున్నారు. ఈ స‌రిహ‌ద్దుపై భిన్న‌మైన వాద‌న‌లు ఉన్నాయ‌నే. అంటే.. ఇది రాజ‌కీయ వ్యూహం. కానీ, త్యాగం చేస్తున్న‌ది సైనికులు. అయితే, ఈ క్రెడిట్ అంతా కూడా మోడీకి చుట్టే ప్ర‌య‌త్నంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్ల‌మెంటులో మాట్టాడుతూ.. ''మోడీ ఉన్నంత వ‌ర‌కు.. భార‌త్‌కు బెంగ‌లేదు'' అని అన్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి ఆజ్యం పోస్తోంది. మోడీ త‌ర్వాత‌.. మోడీకి ముందు కూడా ఈ భార‌త్ ఉంటుంది. మోడీతోనే భార‌త్ ముడి ప‌డ‌లేదు. ఇలా అనుకున్న ఇందిర‌మ్మ‌.. ఆమెకు బాకా బాగా ఊదిన నాయ‌కులు కూడా చ‌రిత్ర‌లో క‌లిసిపోయారు. కానీ, భార‌త్ ఠీవీగా త‌న స‌ర్వ‌స‌త్తాక సార్వ‌భౌమ‌త్వాన్ని చాటుతూనే ఉంది. కానీ, ఇక్క‌డ చ‌ర్చ‌కువ‌చ్చిన‌, వ‌స్తున్న విష‌యం మాత్రం మోడీనే. మోడీ ఉన్నంత వ‌ర‌కు భార‌త్‌కు బెంగ‌లేదంటే.. త‌ర్వాత ఉంద‌నా.. లేక‌, మోడీతోనే భార‌త్‌కు భ‌ద్ర‌త వ‌చ్చిందనా?

ఇలాంటి స‌మాధానాలు..స‌మ‌ర్థింపులు బీజేపీ నేత‌లకుబాగానే ఉన్నా.. వ్య‌క్తి స‌మ‌ర్థ‌త‌ను భూత‌ద్దంలో చూపించే ప్ర‌య‌త్నాల వ‌ల్ల అంత‌ర్జాతీయంగా భార‌త్ సంపాయించుకున్న ద్రుఢ రాజ‌సం.. వ్య‌క్తి ఖాతాలో వేయాల‌నే ప్ర‌య‌త్న‌మ‌నే విష‌యాన్ని మ‌రిచిపోతున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇది నేటితో ఆగేది కాదు.. రేప‌టితో పోయేది కాదు.. 2024లో గెలుపు గుర్రం ఎక్కాలంటే.. అనేక మార్గాలు ఉన్నాయి.. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు అనేక మాధ్య‌మాలు ఉన్నాయి.

అంతే త‌ప్ప‌.. కేవ‌లం మోడీతోనే అన్నీ సాధ్య‌మ‌ని.. ఆయ‌న లేకుంటే.. భార‌త్ లేద‌నే దిశ‌గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో కల్మ‌ష చిగుళ్ల‌ను మొల‌కెత్తించాల‌నే ప్ర‌య‌త్నం అశేష భార‌తావ‌ని.. అభిలాష‌ను త‌క్కువ చేయ‌డ‌మే అవుతుంద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News