పొలీసులంటే ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేవారే కాదు.. ప్రేమ, జాలి చూపించే వారు కూడా ఉంటారు! కరకు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే వారే కాదు.. కరుణతో హత్తుకునే వారు కూడా ఉంటారు! ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న పోలీసు రెండో రకానికి చెందిన వారు. దాదాపు అరకిలోమీటరు పైగా ఒక శవాన్ని భుజాలపై మోసి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఆ మహిళా పోలీసు.. గతంలోనూ ఎందరో ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె పేరు శిరీష.
కాశీబుగ్గ శివారులోని అడవి కొత్తూరు గ్రామ పొలాల్లో ఒక శవం ఉందని స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై శిరీష సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ.. పొలాళ్లోంచి మృతదేహం ఉన్న చోటుకి వెళ్లడానికి సరైన దారి లేదు. పొలాల్లో నుంచి నడుచుకుకుంటనే దాదాపు అరకిలోమీటరు పైగా వెళ్లాలి. దీంతో.. జీపుని రోడ్డు మీదనే నిలిపి, తన సిబ్బందితో కలిసి నడుచుకుంటూ మృత దేహం వద్దకు చేరుకున్నారు ఎస్సై.
అయితే.. ఆ శవం సుమారు 70 ఏళ్ల వయసున్న వ్యక్తిది. గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయింది. స్థానికులను ఆరాతీసినప్పటికీ.. అతనెవరో తెలియదని చెప్పారు. దుర్వాసన వస్తుండడంతో ఎవరూ దగ్గరి కూడా రావట్లేదు. దీంతో.. శవాన్ని మోయడానికి ఎవరూ ముందుకు రాలేదు. జీపు వరకు తీసుకుని రావడానికి ఎవరైనా సాయం చేస్తారెమోనని అడిగినప్పటికీ.. ఎవరూ అంగీకరించలేదు. చివరకు కానిస్టేబుల్స్ కూడా ఇబ్బంది పడ్డారట. శవం అనగానే ఎవరి సెంటిమెంట్లు వారికుంటాయని, అందుకే వారిని ఇబ్బంది పెట్టకుండా నేతానే చొరవ తీసుకున్నానని శిరీష వివరించారు. వెంటనే.. లలితా ఛారిటబుల్ ట్రస్ట్ పర్సన్ కి ఫోన్ చేసి స్ట్రెచర్ తీసుకుని రమ్మని చెప్పారు ఎస్ఐ శిరీష. అతని సహాయంతో ఆ మృతదేహాన్ని స్ట్రెచర్ పై వేసుకొని తిరిగి అరకిలోమీటరు నడుచుకుంటూ జీపు వద్దకు చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని చారిటబుల్ ట్రస్ట్ వారికి అప్పగించి, దహన సంస్కారాలకు కొంత ఆర్థిక సాయం కూడా చేశారు శిరీష.
ఈ విషయంపై స్పందించిన ఎస్ఐ శిరీష.. ఇదేమీ గొప్ప విషయంగా తాను అనుకోవడం లేదని అన్నారు. ఇది తన డ్యూటీలో భాగంగా ఫీలవుతున్నట్టు చెప్పారు. గతంలో తాను ఎన్నో యాక్సిడెంట్ కేసులను చూశానని, గాయాలపాలైన వారిని ఐదు, పది నిమిషాల తేడాలో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వారిలో చాలా మంది బతికారని చెప్పారు. ప్రమాదంలో ఉన్న వారిని, త్వరగా హాస్పిటల్ కు తీసుకెళ్తే బతుకుతారని అనిపించిన వారిని వెంటనే తన జీపులో తరలిస్తానని చెప్పారు శిరీష. ‘సమయానికి తీసుకుని వచ్చారు.. వారు బతికారని డాక్టరు చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది.’ అని అన్నారు ఎస్ఐ.
ఇక తన ఉద్యోగంతోపాటు.. విద్యాభ్యాసం గురించి కూడా వివరించారు. ‘మా సొంతూరు విశాఖపట్నం. అక్కడే పుట్టి పెరిగాను. మా నాన్న తాపీమేస్త్రీ. డిగ్రీ వరకు చదివిన నాకు 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. మద్దిలపాలెంలోని ఎక్సైజ్ ఎస్పీ ఆఫీస్ లో ఏడాదిన్నర కాలం పని చేశాను. తర్వాత సెలవు పెట్టి ఎస్సై పోస్టుకోసం చదివాను. సెలెక్ట్ కావడంతో శ్రీకాకుళం జిల్లాలోని నందిగామలో తొలి పోస్టింగ్ ఇచ్చారు. తరువాత జి. సిగడాం, ఇప్పుడు కాశీబుగ్గలో డ్యూటీ చేస్తున్నాను’ అని చెప్పారు శిరీష.
అయితే.. ఈ సంఘటన తెలుసుకొని డీజీపీ ఫోన్ చేశారట! ఆయన ఫోన్ లో వివరాలు అడిగితే అన్నీ చెప్పానని, కానీ.. ఏమంటారోననే భయం లోపల ఉందన్నారు శిరీష. అయితే.. ఒక మహిళగా నువ్వు చేసిన పని గ్రేట్ అని అభినందించారట డీజీపీ. ‘సేవ చేయాల్సిన సమయం వస్తే ఎటువంటి సంకోచం లేకుండా చేయాలని, అది పోలీసు డ్యూటీ కంటే గొప్పదని చెప్పారట డీజీపీ. అదేవిధంగా తెలంగాణ పోలీసులు కూడా తన కోసం ట్వీట్ చేశారని, ఇది కూడా చాలా సంతోషించదగిన విషయమని చెప్పారు. ఇక ముందు కూడా తన డ్యూటీతోపాటు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తానని చెప్పారు శిరీష.