తాళం ఆయన దగ్గరుంది.. కౌన్ బనేగా హర్యానా సీఎం?

Update: 2019-10-25 08:00 GMT
హర్యానాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. ఓటరు ఈ సారి ఏ పార్టీకి పూర్తి మెజారీటీని అందివ్వలేదు. అధికారంలోకి వస్తామని ఆశలు పడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుడ్డోడు దుష్యంత్ చౌతాలా రూపంలో చుక్కెదురవుతోంది. ఎలాగైనా బీజేపీని అధికారంలో రాకుండా అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో చేసినట్లే ఫలితాల సరళి చూడగానే దుష్యంత్‌కు సపోర్టు చేస్తామని, సీఎం పదవి ఆయనే తీసుకోవచ్చని ఆఫర్ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే..  బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.

రాజకీయ పరిస్థితులు పూర్తిగా తనకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన దుష్యంత్ కూడా ఆఫర్లను చూసి తొందరపడకుండా సీఎం సీటు ఎవరిచ్చారని కాకుండా ఎవరు ఆఫర్ చేసిన సీట్లో కూర్చుంటే కనీసీం మూడునాలుగేళ్లు కూర్చోవచ్చా అని ప్లాన్ చేస్తున్నారు. అందుకే, ఆయన ‘తాళం’ నా దగ్గరే ఉంది అంటూ ఊరిస్తున్నారు.

మరోవైపు బీజేపీ ఇండిపెండెంట్ల మద్దతులో గట్టెక్కగలమా అన్న కోణంలో ప్రయత్నాలు చేస్తోంది.  అదే సమయంలో దుశ్యంత్ బీజేపీకి సహకరించేలా చేసేందుకు మధ్యవర్తిత్వ బాధ్యత విషయంలో బీజేపీ తెలివిగా ప్లాన్ చేస్తోంది. పంజాబ్‌ మాజీ సీఎం, అకాలీదళ్‌ చీఫ్‌ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌, ఆయన కుమారుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌లు దుష్యంత్‌తో చర్చలు జరుపుతూ బీజేపీకి మద్దతివ్వాలని సూచిస్తున్నారు. బాదల్‌ల కుటుంబంతో దుష్యంత్ కుటుంబానికి మంచి సంబంధాలుండడంతో పాటు వారి పట్ల దుష్యంత్ ఎంతో గౌరవంతో ఉంటారని చెబుతుంటారు.. ఆ క్రమంలోనే బీజేపీ అటు నుంచి నరుక్కొస్తున్నట్లు సమాచారం.

అయితే... వయసులో చిన్నోడైనా కూడా రాజకీయంగా తెలివైన అడుగులు వేయడంలో నేర్పిరగా మారిన దుష్యంత్ బాదల్‌ల మాటకు ఊ కొడుతూనే తాళం నా దగ్గరే ఉందంటూ బీజేపీని టెన్షన్ పెడుతున్నారట.  సీఎం పదవి మాకు అప్పగిస్తే మేము కాంగ్రెస్‌తో కలిసి ముందుకు నడుస్తామని ప్రకటించి బీజేపీతో బేరాల్లో తనది పైచేయిగా మార్చుకున్నారు.
Tags:    

Similar News