వ‌రంగ‌ల్‌ పై క‌విత అల్టిమేట్ జోస్యం

Update: 2015-11-10 16:06 GMT
వ‌రంగల్ పార్ల‌మెంటు ఉప ఎన్నికల్లో ప్రచార ప‌ర్వం జోరు పెరుగుతోంది. తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని దాదాపు మంత్రులంద‌రితో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. వీరితోపాటు కేసీఆర్ కుటుంబ స‌భ్యులు కేటీఆర్‌ - హ‌రీశ్‌ రావు అక్క‌డ ప‌ర్య‌టించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు కేసీఆర్ కుమార్తె క‌విత ప్ర‌చారం చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన క‌విత టీఆర్ ఎస్ గురించి, వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఫ‌లితం గురించి అల్టిమేట్ జోస్యం చెప్పారు.

వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో తెలంగాణ ప్ర‌జలు టీఆర్ ఎస్‌ కే ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌ని క‌విత చెప్పారు. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ - టీడీపీ-బీజేపీల‌కు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ప‌లికే ప‌రిస్థితి లేద‌ని ఆమె అన్నారు. కేంద్రంలోని న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం తెలంగాణ‌పై కక్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వ్య‌వ‌హ‌రించారు. నిధులు, విధివిధానాల ప‌రంగా కావాల‌నే జాప్యం చేస్తోంద‌ని క‌విత ఆరోపించారు. ఏడాదిన్న‌ర‌గా ఉద్యోగుల విభ‌జ‌న‌, ప్ర‌త్యేక హైకోర్టు విష‌యంలో కేంద్రం తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌తో టీఆర్ ఎస్ పార్టీకే భారీ స్థాయిలో ఓట్లు ద‌క్క‌నున్నాయ‌ని చెప్పారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే....వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో వార్ వ‌న్ సైడ్ అని క‌విత ప్ర‌క‌టించేశారు.

సొంత పార్టీపై మ‌మ‌కారం ఉండ‌టంలో త‌ప్పులేదు కానీ...ఇత‌ర పార్టీలు సోదిలో కూడా ఉండ‌వు అని చెప్ప‌డం క‌విత‌కే చెల్లిందేమో.
Tags:    

Similar News