ముందస్తు మర్మమేమి మనసా...!

Update: 2018-08-25 17:39 GMT
తెలుగు రాష్ట్రాలలో ఇదీ రాజకీయ పరిస్థితి. 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత 2019 ఏప్రిల్లో  రెండు శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు భిన్నంగా ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య, రెండు దశాబ్దాల పాటు ఒకే పార్టీలో కొనసాగిన ఇద్దరి నాయకుల మధ్య మాత్రం ఒకే అభిప్రాయం లేకపోవడం వారి రాజకీయ చాతుర్యానికి నిదర్శనం. ఐదేళ్లు అధికారంలో ఉండమని తమను పాలించమని ప్రజలు అధికారమిస్తే తమ స్వార్దం కోసం ముందస్తుకు వెళ్లడమేమిటని ప్రతిపక్షాలు - తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితీని నిలదీస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంకా సమయం ఉన్న ముందుగానే ఎన్నికలకు వెళ్లి తిరిగి అధికారంలోకి రావలనుకుంటున్నారు. దీనికి కారణం తెలంగాణ ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉందని - ఎన్నికల గడువు వరకూ ఆగితే ఇది మరింత పెరుగుతుందని కేసీఆర్ భయపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ మనసులో మాత్రం ముందస్తుపై ఏముందో తెలియడం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన ముందస్తుకు కాకుండ షేడ్యుల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గడచిన నాలుగేళ్లుగా  చంద్రబాబు ఏలికలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాన అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు నాయడు విఫలమయ్యారు. దీంతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఇంటిలిజెన్సీ వర్గాల సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు పూర్తి కాలం అధికారాన్ని అనుభవించాలని, మళ్లీ పదవులోకి వస్తోమో రామో తెలియని దశలో ముందస్తుకు వెళ్లడం మంచిది కాదని చంద్రబాబు అనుకుంటున్నారు.

ఇందువల్లే తాను ముందస్తుకు వెళ్లమని తెగెసి చెబుతున్నారు. గతంలో తాను ముందస్తుకు వెళ్లడంతో పరాజయం పాలయ్యననే భయం ఆయనను వెంటాడుతోంది. ఈ భయమూ, ఇక అధికారం దక్కదేమోనని అనుమానమూ చంద్రబాబును ముందస్తు ఎన్నికలకు పురిగొల్పనివ్వడం లేదని అంటున్నారు. ఇదీ రెండు రాష్ట్రాల..... ఇద్దరి చంద్రుల ...... ముందస్తు మనసుల మర్మం.


Tags:    

Similar News