అధికారుల‌కు వ‌ణుకు పుట్టిస్తున్న కేసీఆర్ కోపం!

Update: 2017-12-28 05:02 GMT
తిరుగులేని అధికారంతో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు భారీ షాక్‌ కు గురిచేసింద‌ని ఒక వార్త‌. కేసీఆర్ న‌మ్మ‌కంగా చ‌దివే ఒక మీడియా సంస్థ‌కు చెందిన ప‌త్రిక‌లో ప్ర‌ముఖంగా ఒక వార్త అచ్చు అయ్యింది. దాని సారాంశ‌మేమంటే.. సీఎం సంత‌కం పెట్టిన త‌ర్వాత కూడా ప‌నులు పూర్తి కావ‌టం లేదని. ఆ మాట‌కు వ‌స్తే సీఎం సంత‌కం పెట్టి ఆదేశాలు ఇచ్చినా వాటి అమ‌లు విష‌యంలో అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులకు సైతం వ‌ణుకు పుట్టించే టాలెంట్ ఉన్న త‌న మాట‌ను అధికారులు విన‌క‌పోవ‌ట‌మా? అన్న విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

వెంట‌నే క్రాస్ చెక్ చేయిస్తే.. స‌ద‌రు వార్త‌లో రాసిన‌ట్లే.. తాను సంత‌కం చేసిన ఫైళ్ల‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని.. వాటి అమ‌లు విష‌యంలో వారాల‌కు వారాలు గ‌డిచిపోతున్న స‌త్యాన్ని కేసీఆర్ గుర్తించార‌ట‌. అంతే.. కేసీఆర్ య‌మా సీరియ‌స్ అయ్యార‌ని.. తాను ఆదేశాలు ఇచ్చిన త‌ర్వాత త‌క్ష‌ణ‌మే అధికారులు స్పందించి చ‌ర్య‌లు తీసువాలంటూ ఘాటు లేఖ‌ను స‌ర్య్కుల‌ర్ గా పంపిన‌ట్లు చెబుతున్నారు.

బుధ‌వారం అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌కు.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు.. ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు ఈ లేఖ‌లు పంపిన‌ట్లుగా తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి నుంచి వ‌చ్చే ఆదేశాల్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని.. అత్య‌వ‌స‌ర‌.. అత్యంత ప్రాధాన్య‌త ఉన్న ఆదేశాల్ని అయితే వాయువేగంతో అమ‌లు కావాల‌న్న మాట‌ను స్ప‌స్టం చేసిన‌ట్లుగా స‌మాచారం. సీఎం నుంచి ఆదేశాలు వెలువ‌డిన వారంలో ప‌నులు పూర్తి కావాల‌ని.. అదే విధంగా వివిధ శాఖ‌ల ప్ర‌మేయం ఉన్న ఫైళ్ల‌ను 15 రోజుల్లో క్లియ‌ర్ చేయాల‌న్న ఆదేశాల్ని ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. కేసీఆర్ తాజా సీరియ‌స్ త‌ర్వాత అయినా తెలంగాణ‌లో క్లియ‌ర్ అయిన ఫైళ్లు ఎంత వేగంగా ప‌రుగులు తీస్తాయో చూడాలి.
Tags:    

Similar News