తెలంగాణ పాలిటిక్సులో కేసీఆర్ - మోత్కుపల్లిల గురించి చెప్పమంటే ఎవరైనా ఏం చెబుతారు? కేసీఆర్ పేరెత్తితే చాలు మోత్కుపల్లి ఒంటికాలిమీద లేస్తాడు... మోత్కుపల్లిని కేసీఆర్ బాగా లైట్ గా తీసుకుంటాడు అంటారు. కానీ.. అందరూ అనుకునేలా లేదండోయ్ వీరి రిలేషన్. ఎవరూ ఊహించని రీతిలో మోత్కుపల్లి కూతురి పెళ్లికి స్వయంగా కేసీఆరే వచ్చి దీవించి వెళ్లారంటే చూసుకోండి. నిన్న జరిగిన మోత్కుపల్లి కుమార్తె పెళ్లికి కేసీఆర్ రావడంతో నిజంగానే అంతా షాక్ తిన్నారు. ఇక పొలిటికల్ సర్కిళ్లలో మరీ ముఖ్యంగా టీటీడీపీలో దీనిపై ఎన్నెన్నో అనుమానాలు. మోత్కుపల్లి ఇక మనకు లేనట్లేనా అని టీటీడీపీలో మిగిలిన ఒకరిద్దరు నేతలు అనుకుంటున్నారట.
మోత్కుపల్లికి గవర్నరు పదవి ఆశ చూపించి చంద్రబాబు ఆయన్ను టీడీపీలో ఉంచుతున్నారన్నది అందరికీ తెలిసిందే. అయితే.. మోత్కుపల్లికి కూడా ఈ విషయం అర్థమైపోయిందట. ఎన్నాళ్లైనా బాబు తనకు గవర్నరు గిరీ ఇప్పించేలా లేరని అంటున్నారట. అయితే.. ఆయన పార్టీలు మారుతారో లేదో తెలియదు కానీ.. రాజకీయంగా ఎన్ని తిట్టుకున్నా వ్యక్తిగతంగా వైరుధ్యాలేమీ లేకపోవడంతో మోత్కుపల్లి తన కుమార్తె వివాహానికి పిలవడానికి కేసీఆర్ ఇంటికి వెళ్లారు మొన్న. కేసీఆర్ ఆ సందర్భంగా మోత్కుపల్లితో గంటన్నరకు పైగా ముచ్చటించారు.
అయితే.. ఇంటికి వచ్చాడు కాబట్టి మొహమాటానికి కేసీఆర్ మాట్లాడారే తప్ప నిత్యం తనను తిట్టే మోత్కుపల్లి ఇంట్లో పెళ్లికి వెళ్లరులే అని అంతా అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో కేసీఆర్ అక్కడి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. తాజా పరిణామాలతో రాజకీయంగానూ ఏమైనా మార్పులు రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/