ఏం చేసినా.. చేయకున్నా బయటకు వస్తే చాలు..ముఖానికి మాస్కు అన్నది తప్పనిసరి. ఈ విషయాన్ని దేశ ప్రధాని సైతం అదే పనిగా ప్రస్తావిస్తున్న వేళ.. పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మాస్కుల విషయాన్ని తమకు తోచినట్లుగా అమలు చేస్తున్నారు. కొందరు సీఎంలు మాస్కుల్ని దగ్గరకు రానివ్వకపోవటమే కాదు.. తమ చుట్టూ ఉన్న వారి చేత కూడా వినియోగించకుండా చూస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. వైరస్ ముప్పు శాతం అంతకంతకూ పెరిగే పరిస్థితి.
ఇదిలా ఉంటే.. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా హైదరాబాద్ మహానగరంలో పలు చోట్ల పాజిటివ్ కేసులు భారీగా నమోదైన వేళలో.. ఆయా ప్రాంతాలకు చెందిన వారు తాజాగా నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో పాల్గొనటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎప్పటిలానే కాస్తంత భౌతికదూరంతో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతందా? లేదంటే.. మరిన్ని జాగ్రత్తల నడుమ మంత్రివర్గ భేటీ సాగుతుందన్నది ప్రశ్నగా మారింది.
ఇటీవలే రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి సైతం పాజిటివ్ రావటం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు రాగా.. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు.. ఆయన కుటుంబ సభ్యులకు పాజిటివ్ గా తేలటంతో.. అధికారపక్ష నేతలు మరోసారి ఉలిక్కిపడుతున్నారు. ప్రజల్లో తిరిగే నేతలకు పాజిటివ్ ముప్పు మరింత ఎక్కువని చెబుతున్నారు. ఇలాంటివేళ.. ఈ రోజు నిర్వహించే మంత్రివర్గ సమావేశం సందర్భంగా అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందంటున్నారు.
గతంతో పోలిస్తే.. ఈసారి మరింత భౌతిక దూరాన్ని వాడటంతో పాటు.. మాస్కులు తప్పనిసరి లాంటి నిబంధనల్ని అమలు చేయాలన్న మాట వినిపిస్తోంది. అసలు.. వర్చువల్ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచన చేతల్లో వర్క్ వుట్ కాదని చెబుతున్నారు. ఏమైనా.. తాజాగా నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం వైరస్ ముప్పు భయాన్ని మరింత పెంచే వీలుందంటున్నారు. అందుకే.. మరింత పక్కాగా డీ ఇన్ ఫెక్టు చేయటం మంచిది. ఈ జాగ్రత్తలన్ని అధికారులు తీసుకుంటున్నారా సారూ?