చంద్రబాబుకు ముని శాపం ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి పదే పదే అనేవారు. అయితే, ముని శాపం మాట ఏమో కానీ.. చంద్రబాబుకు కేసీఆర్ శాపం మాత్రం తప్పకుండా ఉంది. ఎందుకంటే, ఆయన మంచి చేసినా.. దానికి సంబంధించిన క్రెడిట్ ఆయనకు దక్కడం లేదు. చంద్రబాబు ఏ మంచి పని చేసినా దానికి సంబంధించిన క్రెడిట్ కేసీఆర్‌కు పోతోంది. భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుంది.
ఉద్యోగులకు కేసీఆర్ 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అనివార్యంగా ఏపీ ఉద్యోగులకు కూడా 43 శాతం పిట్‌మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సందర్భంలో పైకి ఏం మాట్లాడినా.. అంతర్గతంగా మాత్రం ఏపీ ఉద్యోగులు కూడా కేసీఆర్‌నే మనసులో అభినందించారు. ఆయన వల్లే తమకు అంత భారీ పిట్‌మెంట్ వచ్చిందని, చంద్రబాబుతో చర్చలు జరిగి ఉంటే రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందంటూ 30 శాతం కూడా ఇచ్చేవాడు కాదని ఉద్యోగులంతా అనుకున్నారు.
ఇప్పుడు, అంగన్‌వాడీలకు కేసీఆర్ జీతాలు భారీగా పెంచారు. తెలంగాణ బడ్జెట్లోనే ఈ మేరకు ప్రకటించారు. దాంతో పెంచింది కాస్తే అయినా.. తెలంగాణలో అంగన్‌వాడీలు ఇంకా అసంతృప్తితోనే ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు మాత్రం మండిపడుతున్నారు. తమకు కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అందువల్ల అంగన్‌వాడీలకు జీతాలు పెంచడం అనివార్యం. అందుకు మహా అయితే మరో రూ.400 కోట్లు అవుతుంది. కానీ, ఇప్పుడు ముందుగా కేసీఆర్ అడుగు వేసేశారు. ఇప్పుడు అంగన్‌వాడీలంతా ఆందోళన చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చి హైదరాబాద్‌లో తిష్ట వేశారు. ఈ సమయంలో చంద్రబాబు పెంచినా ఆ క్రెడిట్ మళ్లీ కేసీఆర్‌కు, పోరాటానికే వెళుతుంది.
చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నెల్లూరులో ఘనంగా జరిపారు. ఆరోజు అంగన్‌వాడీలు జీతాల కోసం డిమాండ్ చేశారు. ఆరోజే చంద్రబాబు అంగన్‌వాడీలకు జీతాల పెంపుపై ప్రకటన చేసి ఉంటే ఏపీతోపాటు తెలంగాణలోనూ జీతాలు పెంచిన ఘనత చంద్రబాబుకు దక్కేది. కానీ, ప్రతి విషయానికి అలవిమాలిన జాప్యం చేయడమే చంద్రబాబు మంచి చేస్తున్నా ఆ క్రెడిట్ ఆయనకు దక్కకుండా చేస్తోందని టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.