మాకేం జేసినవ్...కారుకు ఎదురుదెబ్బలు

Update: 2018-10-27 05:42 GMT
" తెలంగాణ దెచ్చినామన్నారు. సరేదియ్. ఈ పొద్దుకు మీకే ఎత్తాం అన్నాం. ఏసినం. కాని మీరేం జేసినారు"
" గా ఎన్నికలప్పుడు గనబడితివి. ఇగో ఇప్పుడు మల్ల అత్తివి. మల్లీ ఎపుడొస్తవో "

ఇవీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులు ఎదుర్కొంటున్న ప్రశ్నలు. తెలంగాణకు ముందస్తు ఎన్నికలతో పాటు ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించి రికార్డ్ స్రష్టించానని ఆ పార్టీ అధినేత చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.  తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత రానురాను పెరుగుతోంది.  గడచిన ఎన్నికల్లో గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేలెవ్వరూ తమ దిక్కు చూడలేదనే కోపంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు. అయితే ఇంటెలిజెన్సీ నివేదికల్లో తనకు అనుకూలంగా ఉందని, ఒకరిద్దరి పట్ల వ్యతిరేకత ఉన్నా మొత్తమ్మీద అనుకూలంగానే ఉందని నివేదికలు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ముందస్తుకు వెళ్లారు.

వివిధ సర్వేలు - నివేదిక ఆధారంగానే సిట్టింగులు అందరికి టిక్కట్లు ఇచ్చారు. కేవలం ఐదారుగురిని మాత్రమే పక్కన పెట్టారు. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కొంప ముంచేలా ఉందంటున్నారు.ప్రజలు తనను - తాను చేసిన అభివృద్ధిని చూసి గెలిపిస్తారని కె.చంద్రశేఖర రావు చాలా నమ్మకంగా ఉన్నారు. రానురాను పరిస్ధితులు అందుకు తగ్గట్టుగా కనిపించడం లేదు. దాదాపు సగం నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధుల ప్రచారంలో చేదు అనుభవమే ఎదురవుతోంది. కొన్ని గ్రామాల్లో ఎందుకొచ్చారంటూ బ్యానర్లు సైతం కట్టడం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఖమ్మం - నిజామాబాద్ - వరంగల్ - కరీంనగర్ - నల్లగొండ వంటి నియోజకవర్గాల్లో అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులు తిరగలేని పరిస్థితి ఉందని అంటున్నారు. మరోవైపు మహాకూటమి అభ్యర్ధులు ప్రకటన తర్వాత పరిస్ధితి ఎలా ఉంటుందో అనే బెంగ అధిష్టానాన్ని పీడిస్తోంది. ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి తప్పు చేసామా అని పార్టీ సీనియర్లు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత ఎన్నికల నాటికి మరింకెంత ముదురుతుందోననే ఆందోళన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను వెంటాడుతోంది.  


Tags:    

Similar News