ఓటుకు నోటు కేసులో చిక్కుకుని టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో తనను పిలిచిన చోటికి - పిలవని చోటికి పోయి మరీ టీఆరెస్ కు వ్యతిరేకంగా గొంతు చించుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లినా ఆయనది ఒకటే పాట. కేసీఆర్ పదవి పోగొట్టాలి.. టీఆరెస్ ను హరీశ్ చీల్చుతాడు అంటూ పాడిందే పాడుతూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోనూ రేవంత్ అదే పాట పాడారు.
తెలంగాణలో లక్షా ఏడు వేల ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఉడగొట్టాలంటూ ఆయన అరిగిపోయిన రికార్డును సిరిసిల్లలోనూ వినిపించారు. మహేందర్ రెడ్డికి మద్దతుగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ సొంత పార్టీ కాంగ్రెస్ ను ఇరుకునపెట్టే హామీ ఇచ్చారు. ఓవైపు ఆ పార్టీ తన మేనిఫెస్టోలో సైతం ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పగా.. రేవంత్ మాత్రం అధికారం చేపడితే 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించేశారు.
సిరిసిల్ల అభివృద్ధి కేటీఆర్ వల్ల సాధ్యం కాదంటూ స్థానికుడినే ఇక్కడ గెలిపించాలని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అయితే.. మంత్రి హోదాలో ఉన్న నేత ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో మంత్రి కంటే ఎక్కువగా స్థానికులు ఇంకేం చేయగలరో మాత్రం ఆయన చెప్పలేదు.
అంతేకాదు.. కేటీఆర్ పై వ్యక్తిగత విమర్శలూ చేసి తన స్థాయి ఎలాంటిదో చెప్పకనే చెప్పారని టీఆరెస్ నేతలు అంటున్నారు. కేటీఆర్ చెప్రాసీగా కూడా పనికిరారని.. అమెరికాలో ఆయన బాత్రూంలు కడిగేవాడని అంటూ దిగజారుడు విమర్శలు చేశారు. కేసీఆర్ - కేటీఆర్ ఓడిపోతే టీఆర్ ఎస్ ను గుంజుకోవడానికి మంత్రి హరీశ్ చూస్తున్నారంటూ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నమూ చేశారు. అయితే... రేవంత్ ఎంత అరిచి గీపెట్టినా వినడానికి ఆ సభకు పెద్దగా జనాలు మాత్రం రాలేదు.