తెలంగాణలో కేసీఆర్ కింగ్ మేకర్.. కానీ దేశంలో కాదు.. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లున్నాయి. ఎంఐఎంకు హైదరాబాద్ సీటు పోను 16 సీట్లు వస్తాయనుకుందాం. తాజాగా సీఓటర్-రిపబ్లిక్ టీవీ కూడా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 16 సీట్లు ఖాయమని ప్రకటించింది. ఖమ్మం లాంటి బలం లేని చోట్ల టీఆర్ ఎస్ గెలుస్తాందన్న నమ్మకం పూర్తి స్థాయిలో లేదు. పోనీ సరాసరిగా 15 సీట్లు గెలుస్తుందని అనుకుందాం. ఈ 15 సీట్లతో దేశ రాజకీయాలను ఎలా మార్చవచ్చు.. 543 ఉన్న లోక్ సభ స్థానాల్లో 16 సీట్ల మేజిక్ మార్క్ తో దేశ రాజకీయాల్లో ఏలాంటి సంచలనాలు - చరిత్రలు సృష్టించే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
యూపీలో అధికారం చేపట్టే పార్టీకి మాత్రం దేశాన్ని శాసించే అధికారం ఉంది. అక్కడ 80 ఎంపీ సీట్లున్నాయి. పోయిన 2014 ఎన్నికల్లో బీజేపీ 72 గెలిచి ఢిల్లీలో అధికారం చేపట్టింది. యూపీలో గెలిచే పార్టీనే దేశాన్ని ఏలుతుందన్న నానుడిని నిజం చేసింది.
ఇప్పుడు కేసీఆర్ తెస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో ప్రధాన భాగస్వాములుగా బెంగాల్ సీఎం మమత - యూపీ సమాజ్ వాదీ నేతలు అఖిలేష్ - మాయవతి ఉన్నారు. యూపీలో వీరిద్దరూ కలిస్తే 70కు పైగా సీట్లు వస్తాయి. దీదీ మమతకు బెంగాల్ లో 42 సీట్లున్నాయి. కేసీఆర్ కు 16 సీట్లున్నాయి. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కలిసినా ఆయన చేతిలో 21 సీట్లు కలిసివస్తాయి. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తే 140కు పైగా సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఈ పార్టీలు అఖండ విజయాలు సాధిస్తేనే ఈ లెక్క..
ఇక కాంగ్రెస్ ఫ్రంట్ కు మద్దతిస్తున్న డీఎంకే స్టాలిన్ కు తమిళనాడులో 39 ఎంపీ సీట్లున్నాయి. కర్ణాటకలో జేడీయూ-కాంగ్రెస్ చేతిలో 28 ఎంపీ సీట్లున్నాయి. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు ఉండడంతో ఏపీలో 25 ఎంపీ సీట్లున్నాయి. ఇక్కడ వైసీపీ గెలిచినా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతివ్వాల్సిందే.. ఇక బీహార్ లో 40 ఎంపీ సీట్లు - ఒడిషాలో 21 సీట్లున్నాయి. చిన్నా చితక పార్టీలు కలిపినా 150కు పైగా సీట్లు కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీలతోనే వస్తున్నాయి. మరో 100 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ దే అధికారం.
మొత్తం 542 సీట్లలో 140 సీట్లు సాధించి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దేశంలో అధికారంలోకి రావడం ఖల్ల.. మ్యాజిక్ ఫిగర్ 271 రావాలంటే ఖచ్చితంగా దేశంలోనే ప్రధాన అధికార - ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ - బీజేపీ మద్దతు కావాల్సిందే.. ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకోకుండా ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టాలనుకుంటున్నా కేసీఆర్ ఆశలు ఏమేరకు నెరవేరుతాయనేది వేచి చూడాల్సిందే..