కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ ఇచ్చిన కేసీఆర్

Update: 2022-04-11 09:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్ లైన్ పెట్టారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. ఒక దేశం ఒకటే ధాన్యం సేకరణ విధానం ఉండాలంటూ నినదించారు. కేసీఆర్ కు రైతు నేత రాకేష్ టికాయత్ మద్దతు పలికారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం  తమ రాష్ట్ర రైతులను ఆదుకోవాలని.. ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో పోరాటం చేయడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు.

2వేల కి.మీల దూరంలో ఉన్న ఢిల్లీకి తెలంగాణ ప్రభుత్వం, ప్రతినిధులు, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు రావాల్సి వచ్చిందో దేశం మొత్తానికి తెలియాలని కేసీఆర్ అన్నారు. మేం గోల్ మాల్ చేశామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్న ఆయన పీయూష్ గోయల్ కాదని.. పీయూష్ గోల్ మాల్ అని మండిపడ్డారు.

తెలంగాణకు ఓ వ్యక్తిత్వం, అస్తిత్వం ఉందని పీయూష్ గోయల్ అన్నారు. రాష్ట్రంలో భూములు, వర్షాలు, పరిస్థితుల ఆధారంగా రైతులు పంటలు వేయడాన్ని మార్చాలని.. వేరేపంటలు వేయాలని తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర రైతులను కోరారని.. కానీ ప్రభుత్వం మాటలు వినవద్దని.. రైతులు తమ ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవాలని కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి చెప్పారన్నారు. ఆ వీడియోను సభలో ప్రదర్శించారు. ధాన్యం కొంటామని చెప్పిన కిషన్ రెడ్డి కోతలు మొదలైన నాటి నుంచి పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. తాము ఢిల్లీలో ధర్నా చేస్తే.. పోటీగా  బీజేపీ నేతలు హైదరాబాద్ లో నిరసన చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మాట మార్చి వారిని దారుణంగా మోసం చేశారని.. బీజేపీకి, కేంద్రానికి సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు.4 గంటల్లో ధాన్యం సేకరణపై నిర్ణయం ప్రకటించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

 దేశంలో రైతుల కోసం కొత్త ఉద్యమం ప్రారంభం కావాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తెలంగాణ ప్రజలంతా మీ వెంట ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా రైతు దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన రాకేష్ టికాయత్ కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.  తెలంగాణ నుంచి ఇంత మంది వచ్చి దీక్ష చేయడానికి కారణమెవరని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరితోనైనా గొడవ పడవచ్చని.. కానీ రైతులతో పడవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? అని ప్రశ్నించారు.

ఉమ్మడి ఏపీలో తెలంగాణలో సాగు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని.. రాష్ట్ర సాధనలో వందలాది యువత బలిదానాలు చేసిందని గుర్తు చేశారు. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని..  ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కూడా విద్యుత్ కోసం రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు.

కేంద్రానికి ఎదురుతిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులేనా అని ప్రశ్నించారు. తనను జైలుకు పంపుతామంటున్న బీజేపీ నేతలు.. సీఎంను జైలులో పెడుతారా? దమ్ముంటే రావాలని సవాల్ చేశారు.
Tags:    

Similar News