కేసీఆర్ ఫ‌స్ట్ వార్నింగ్ ఇచ్చేశారుగా!

Update: 2018-12-13 04:36 GMT
విజ‌యం సాధించిన వేళ విన‌మ్ర‌త‌తో ఉండాలి. విజ‌యానందంలో ఏమేం చేయ‌కూడ‌దో ఆయ‌న‌కు బాగా తెలుసు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వేళ‌.. కూల్ గా మాట్లాడిన ఆయ‌న‌.. త‌ర్వాతి రోజున మీడియా మిత్రుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన కేసీఆర్‌.. త‌న‌లోని రెండో కోణాన్ని బ‌య‌ట‌పెట్టేశారు.

త‌న‌ను ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒక ఆట ఆడుకున్న మీడియాను ఉద్దేశించి.. అంద‌రూ ఎంతో స‌హ‌క‌రించారు. మీడియా చాలా బాగా రియాక్ట్ అయ్యింది. జ‌ర్న‌లిస్టులు ఎంతో బాగా ప‌ని చేశారంటూ పొగిడేసిన ఆయ‌న పొగ‌డ్త‌లు విని.. అరే.. కేసీఆర్ ఇలా మాట్లాడ‌టం ఏమిట‌న్న మాట ప‌లువురి నోట వినిపించింది.

తాను అనుకున్న‌ది సాధించిన రోజున ఉట్టిప‌డే విన‌మ్ర‌త‌తో ఉండ‌టం.. నోరు జార‌కుండా ఉండ‌టం కేసీఆర్ నైజం. ఆ త‌ర్వాత తాను అనుకున్న ఎజెండా ప్ర‌కారంగా రియాక్ట్ కావ‌టం ఆయ‌న‌కు అల‌వాటు. తాజాగా అలాంటి ప‌నే చేసిన ఆయ‌న‌.. మీడియా ప్ర‌తినిధుల ఎదుట త‌న గ‌ళాన్ని విప్పారు. త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసిన వారని కాకుండా.. అక్ర‌మార్కుల్ని ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా అలాంటిది.. ఇలాంటిది కాకుండా ప్ర‌త్య‌ర్థుల వెన్నులో చ‌లి పుట్టేలా ఆయ‌న నోటి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.

గ‌డిచిన ట‌ర్మ్ లో తానేం మాట్లాడితే రాష్ట్రాభివృద్ధిని ప‌క్క‌న పెట్టి వెంటాడిన‌ట్లు ఉంటుందన్న ఉద్దేశంతో ఊర‌కుండిపోయాన‌ని.. ఈసారి మాత్రం అందుకు భిన్న‌మైన ఎఫెక్ట్ ఉంటుంద‌న్న మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చింది.త‌న‌ను తిట్టేవాళ్ల‌కు సంబంధించి ఎన్నో కుంభ‌కోణాలు ఉన్నాయ‌ని.. ఆ విష‌యాల‌న్నీ త‌న‌కు తెలుస‌న్న ఆయ‌న‌.. దొంగ‌ను ఎప్పుడైనా ప‌ట్టుకోవ‌చ్చ‌ని ఉండిపోయాన‌ని.. ఈసారి మాత్రం అలా ఊరుకునేది లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

సూటిగా.. సుత్తి లేకుండా.. చాలాసేపు మాట్లాడిన ఆయ‌న మాట‌ల్ని మూడుముక్క‌ల్లో చెప్పాలంటే.. వ‌చ్చే సారాంశ‌మిది. అదేమంటే.. ‘‘పోయిన టర్మ్‌లో నేనేం మాట్లాడినా, ఏం చేసినా రాష్ట్రాభివృద్ధిని పక్కనబెట్టి తమను వెంటాడుతున్నట్లు తిట్టేవాళ్లు. వాళ్లవి ఎన్ని కుంభకోణాలున్నాయో తెలుసు. దొంగను ఎన్నడైనా పట్టుకోవచ్చు. మొదట రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలనుకున్నాం. అది చాలా పెద్ద బాధ్యత. అందుకే వీళ్ల కేసులను ఉపేక్షించాల్సి వచ్చింది"

"ఈ టర్మ్‌ లో వదలం. రెండు రకాల పనులు చేస్తాం. ఎవరు పడితే వాళ్లు కుక్కలు మొరిగినట్టు మొరిగితే ఊరుకోం. దానికి ట్రీట్‌ మెంట్‌ తప్పనిసరిగా ఉంటుంది. దొంగల భరతం పడతాం. ఎవడెవడు ఏం మేసిండో అన్నీ తెలుసు. వాటిని కక్కిస్తాం. ఓటుకు నోటు విచారణ కూడా జరుగుతోంది’’ అంటూ సూటి వార్నింగ్ ఇచ్చేశారు. బాహుబ‌లి కేసీఆర్ లిస్ట్ లో బాబు పేరు ఉంద‌న్న విష‌యం క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. ఇక‌.. మిగిలిన వారెవ‌ర‌న్న‌ది మాత్రం రాజ‌కీయ వెండితెర మీదే ఆవిష్కృతం కావాల్సి ఉంద‌న్న మాట‌. 
Tags:    

Similar News