టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదేదో ఆయన జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం చేస్తున్న ప్రయత్నంతో కాదు...ఆయన గుడ్ మార్మింగ్ చెప్పిన తీరుతో ఈ చర్చ మొదలైంది. ఇదంతా కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం గురించి. రాష్ట్రంలోని 58.33 లక్షల మంది రైతులకు కోటి 43 లక్షల 27 వేల ఎకరాల సాగుభూమికి పంట సాయం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇందుకోసం 5 వేల 730 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను అందించనున్నారు. ఇవాళ్లి నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 833 గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ అన్ని ప్రధాన భాషల్లో ఇవాళ ఉదయాన్నే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి భాషలో పలకరించారు. ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా... అటు పంజాబ్ నుంచి అస్సామ్ వరకు అన్నీ భాషల్లో వివిధ డిజైన్లలో ఆయా భాషల్లోని ప్రధాన పత్రికల్లో మొదటి పేజీల్లో రైతు బంధు ప్రకటన విడులైంది.
ఇటీవలి కాలంలో పెద్ద రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ ప్రకటనలు ఇచ్చేవి. సీఎం ఫొటోలతో ప్రకటనలు ఇవ్వొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాల జోరు తగ్గింది. సుప్రీం తీర్పుకు సవరణలు జరగడంతో ఇపుడు భారీ ప్రకటనల హోరు మొదలైంది. ఫెడరల్ ఫ్రంట్ తో దేశ వ్యాప్తంగా ఓ చర్చను లేవదీసి సంచలనం రేపిన కేసీఆర్ రైతు బంధు ప్రకటనలో దాదాపు అన్ని రాష్ట్రాల పత్రికల్లో ఇవాళ దర్శనమిచ్చారు. దాదాపు అన్ని పత్రికల్లో ఈ ప్రకటనలు రెండు పేజీల్లో వచ్చాయి. రైతు బంధు పథకం ప్రత్యేకతలతో పాటు రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ ప్రకటనల్లో వివరించారు. దేశ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీలో కూడా ఇవాళ ప్రధాన పత్రికల్లో రైతు బంధు పథకం యాడ్‌తో మార్కెట్‌లో దర్శనమిచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఢిల్లీతో పాటు ఆ పత్రిక ప్రధాన ఎడిషన్స్ లో రైతు బంధు పథకం తొలి, రెండో పేజీ ప్రకటనగా వచ్చింది. ఢిల్లీలోని దాదాపు ప్రధాన పత్రికల్లో ఇవాళ కేసీఆర్ ప్రకటన కన్పించింది.
జాతీయ భాషలతో పాటుగా హిందీలోనూ హిందుస్థాన్ టైమ్స్ కు చెందిన హిందుస్థాన్ పత్రికతో పాటు ప్రధాన మీడియా సంస్థలను తెలంగాణ ప్రభుత్వం ఎంచుకుంది. పంజాబీ - అస్సామీ - ఉర్దూ - ఒరియాతో సహా దక్షిణాది భాషల్లో రైతుబంధు ప్రకటన సంచలనం రేపింది. ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్రకటనలు పొరుగు రాష్ట్రాల్లో రావడం గతంలో మామూలేనని అయితే ఈ రీతిలో ప్రచారం చేసుకోవడం ఆసక్తికరంగా ఉందంటున్నారు.