ఇక.. రెండు రోజులూ ఫాంహౌస్ లోనేనంట

Update: 2016-01-09 04:46 GMT
ఐదు రోజుల పాటు సాగిన అయుత చండీయాగం కోసం దాదాపు ఎనిమిది రోజులకు పైనే ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాల్లో బిజీబిజీగా పాల్గొన్న సంగతి తెలిసిందే. యాగం తర్వాత..వేములవాడలో మొక్కులు తీర్చుకొని హైదరాబాద్ కు వచ్చిన కేసీఆర్.. నాటి నుంచి బిజీబిజీగా గడిపేసిన సంగతి తెలిసిందే.

వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన శుక్రవారం రాత్రి మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్ కి వెళ్లిపోయారు. శని.. ఆదివారాలు ఆయన ఫాంహౌస్ లోనే గడపనున్నారు. ఈ సందర్భంగా తన వ్యవసాయ క్షేత్రంలోని పంటల్ని.. ఎర్రవెల్లి గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల కార్యక్రమాన్ని సమీక్షిస్తారని చెబుతున్నారు. ఏమైనా.. భారీ సెలవుల తర్వాత సిటీకి వచ్చిన ఆయన కొద్దిరోజులకే మళ్లీ ఫాంహౌస్ వెళ్లటం గమనార్హం. 
Tags:    

Similar News