తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చాలా మందికి కలిగే ఆసక్తికరమైన సందేహం. ఆయన ఆస్తి ఎంత? ఎలాంటి పెట్టుబడులు ఎక్కడెక్కడ ఉన్నాయనే ఉత్సుకత అనేకమందిలో ఉంది. అయితే దేశంలోనే సంపన్న రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ విషయంలో ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటన తర్వాత కేసీఆర్ ఆస్తి వివరాల అంశం కూడా తెరమీదకు వచ్చినపుడు... కేసీఆర్ తనయ కవిత మాట్లాడుతూ తమకు ప్రకటించే దగిన స్థాయిలో ఆస్తులు లేవని వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇపుడు అదే రీతిలో తన ఆస్తి కేవలం రూ.10,000 అంటూ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తీర్చిదిద్దుతున్న నేపథ్యం, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు ప్రస్తావనకు వస్తూ కేసీఆర్ ఆస్తిపాస్తులు కూడా తెరమీదకు వచ్చాయి. ఆ సందర్భంలోనే కేసీఆర్ తన జేబులోని పదివేలు తీసి చూపిస్తూ ఇదే నా ఆస్తి అని చమత్కరించారు. "ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన సొమ్ము బ్యాంకులో ఉంది. వ్యవసాయ క్షేత్రం మేనేజర్ కు ఫోన్ చేసి పరిస్థితి ఏమిటి? అని అడిగితే పది వేల వరకూ ఇస్తామన్నారు. చెక్కు పంపితే - పదివేలిచ్చారు. ఇప్పటికిదే పదివేలు" అంటూ చమత్కరించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి పదివేలేనంటూ జేబులోని రెండు వేల రూపాయల నోట్లు ఐదు తీసి చూపించారు. పైగా ఈ పది వేలకు చిల్లర దొరికే పరిస్థితి లేదని చమత్కరించారు. సీఎం పరిస్థితే ఇలావుంటే, పెద్ద నోటు దెబ్బ రాష్ట్ర ప్రజలపై ఇంకెంత బలంగా ఉందోనని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు - అమ్మకాలు లేక వ్యాపారాలు మొత్తం నిలిచిపోయాయన్నారు. హిమాయత్ నగర్ లోని మినర్వా హోటల్ కు వెళ్లడం తనకు అలవాటని, అక్కడ ఎప్పుడూ పెద్ద సంఖ్యలో ఉండే జనం కనిపించక ఖాళీగా ఉందని ఒక సీనియర్ అధికారి ఒకరు సీఎంకు తన అనుభవాన్ని వివరించారు. రోడ్లపై ట్రాఫిక్ సైతం తగ్గిపోయిందని, బట్టల షాపులు, ఎలక్ట్రానిక్ షాపుల్లో జనమే కనిపించడం లేదని అధికారులు వివరించారు. రెండు నెలల్లో పరిస్థితి మెరుగవుతుందని ప్రధాని మోడీ చెబుతున్నా, ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యంకాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/