భార్య బొమ్మతో విడాకుల పార్టీ... మామూలు సంబరం కాందంటున్న మంజిత్!

సాధారణంగా జీవితంలో జరిగే అత్యంత అందమైన, అద్భుతమైన ఘట్టంగా వివాహాన్ని చూస్తారు.

Update: 2024-12-12 12:30 GMT

"పెళ్లంటే... మూడే ముళ్లు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్లు" అనే పద్దతి చాలా మంది దృష్టిలో ఎప్పుడో పోయిందనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఆడా, మగా అనే తారతమ్యాలేవీ లేవని.. మ్యారేజ్ లైఫ్ లో డివోర్స్ అత్యంత సహజం అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. ఈ సమయంలో డివోర్స్ పార్టీ తెరపైకి వచ్చింది.

సాధారణంగా జీవితంలో జరిగే అత్యంత అందమైన, అద్భుతమైన ఘట్టంగా వివాహాన్ని చూస్తారు. జీవితాన్ని రెండు భాగాలుగా ఆలోచిస్తే... పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అని చెబుతుంటారు. దీంతో.. పెళ్లికి ముందు బ్యాచ్ లర్ పార్టీ, పెళ్లి విందు, రిసెప్షన్ సంబరం మొదలైనవి ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు డివోర్స్ పార్టీ వచ్చి చేరింది.

అవును... ప్రేమలో ఉన్న జంట విడిపోవాలని ఫిక్సయితే ఒకప్పుడు 'దేవదాసు' పాటలు, ఆ తర్వాత 'మజ్ఞు', 'ప్రేమ', 'ప్రేమిస్తే' మొదలైన సినిమాలో పాటలు వినిపించేవని అంటారు. అయితే... ఇప్పుడు చాలా మంది ప్రేమికులు విడిపోవాలనుకున్న సమయంలో "బ్రేకప్" పార్టీ చేసుకుని మరీ విడిపోతున్నారు. ఇది ఇప్పుడు వివాహ వ్యవస్థకూ పాకింది.

ఈ సమయంలో ఈ తరహా డివోర్స్ పార్టీ కల్చర్ విదేశాల్లో ఎక్కువగా ఉందని చెబుతుండగా.. ఇప్పుడు భారత్ లోనూ మొదలైంది! తాజాగా హర్యానాలో విడాకుల సంబరం జరిగింది. మంజిత్ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు త్న బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.. వారికి విందు ఏర్పాట్లు చేశాడు.

వివరాళ్లోకి వెళ్తే... 2020లో మంజిత్ అనే యువకుడు కోమల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే.. కారణాలు ఏవైనప్పటికీ వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. దీంతో... వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో ఈ ఏడాది వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరూ అయ్యాయి!

దీంతో... ఓ పెద్ద పార్టీ ప్లాన్ చేశాడు మంజిత్. ఈ వేడుకకు సంబంధించిన వేదిక వద్ద తన పెళ్లి ఫోటో, పెళ్లి జరిగిన తేదీ తో పాటు విడాకులు మంజూరైన తేదీ తదితర వివారాలతో ఓ ఫ్లెక్సీని కూడా ఏర్పాటూ చేశాడు. వచ్చిన బంధు మిత్రులందరికీ అద్భుతమైన వెరైటీ వెరైటీ వంటకాలు ప్రత్యేకమైన విందు ఏర్పాట్లు చేశాడని అంటున్నారు.

ఇక్కడ మరో ఆసక్తీక్ర విషయం ఏమిటంటే... ఈ వేడుకలో తన మాజీ భార్య విగ్రహం సైజులో ఓ బొమ్మ ఏర్పాటు చేసి, ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపించాడు. ఈ సందర్భంగా.. ఇది తన లైఫ్ లో బెస్ట్ ఈవినింగ్ అంటూ హల్ చల్ చేశాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News