నిజమా? అబద్ధామా? గ్రూప్-2పై క్లారిటీ ఇదే...

అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ పరీక్షలు యథాతథం జరుగుతాయని మరో ప్రకటన ప్రచారంలోకి వచ్చింది.

Update: 2025-02-22 10:33 GMT

గ్రూప్-2 పరీక్షలు వాయిదా అంటూ కొందరు.. లేదు లేదు యథాయథంగా పరీక్ష జరుగుతుందని మరికొందరు ప్రచారం చేస్తుండటంతో గ్రూప్-2 పరీక్షలపై తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. ప్రధాన పత్రికల్లో కూడా ఈ అంశంపై భిన్నమైన కథనాలు, వార్తలు వెలువడుతుండటం మరింత అయోమయానికి గురిచేస్తోందని అంటున్నారు. ఫిబ్రవరి 23 ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సివుంది. మరో 24 గంటల్లో పరీక్ష జరుగుతుందనగా, పరీక్ష వాయిదా అంటూ తొలుత విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ పరీక్షలు యథాతథం జరుగుతాయని మరో ప్రకటన ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏపీపీఎస్సీ అధికారిక ట్విటర్ అకౌంట్ లో ఈ విషయమై ఎలాంటి సమాచారం లేకపోయినా, ఏపీపీఎస్సీ అధికారిక వైబ్ సైట్ లో మాత్రం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టమైన ప్రకటన చేసింది.

పరీక్ష వాయిదా అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఏపీపీఎస్సీ ఆగమేఘాలపై స్పందింది. తప్పుడు ప్రచారాన్ని ఖండించడమే కాకుండా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన సోషల్ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి పరీక్షలను వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు కోరుతున్నారు. రోస్టర్ విధానంలో మార్పులు చేయలంటూ కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా, పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం మధ్యాంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. 2023 డిసెంబర్ 7న జారీ చేసిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ సుప్రీం తీర్పు, ఏపీ ప్రభుత్వ జీవో 77కి విరుద్ధంగా ఉందని అభ్యర్థులు వాదిస్తున్నారు.

సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ అభ్యర్థులు మరోసారి హైకోర్టును అభ్యర్థించారు. అయితే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారా పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు దీనికి సంబంధించిన ప్రక్రియ చేపడతామని తెలిపింది. పోస్టులు, జోన్ లపై అభ్యర్థులు ప్రాధాన్యతలు ఇవ్వాల్సివుంటుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో అభ్యర్థులకు న్యాయం చేస్తామని గతంలో మంత్రి నారా లోకేశ్ కూడా హామీ ఇచ్చారు.

Tags:    

Similar News