ట్రంప్ బాంబు: USAID డబ్బులిచ్చింది భారత్ కే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. USAID (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) ద్వారా భారతీయ ఎన్నికలపై ప్రభావం చూపేందుకు $21 మిలియన్లు ఖర్చు చేశారని ట్రంప్ ఆరోపించారు. DOGE (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఈ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, "అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలపై వచ్చిన సమాచారం చూసి ఖండిస్తున్నాం. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యానికి దారితీస్తుంది" అని పేర్కొంది. USAID ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.
అయితే, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. ట్రంప్ పేర్కొన్న $21 మిలియన్లు భారత్‌కు కాకుండా బంగ్లాదేశ్‌కు కేటాయించబడ్డాయని వెల్లడించింది. ఈ వివాదం నేపథ్యంలో భారతీయ రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) , కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విదేశీ నిధులను ఉపయోగించి ప్రధాని మోదీని అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించగా.. కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది.
USAID నిధుల వివాదం ప్రస్తుతం భారత్‌లో రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ఈ అంశంపై మరింత స్పష్టత కోసం సంబంధిత సంస్థల నుండి అధికారిక ప్రకటనలు ఎదురుచూడాల్సి ఉంది.
అయితే తాజాగా మరోసారి ట్రంప్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మరోసారి ప్రకటించారు. భారత్ కు ఏకంగా 21 మిలియన్లు డబ్బులు ఇచ్చారని.. ఇక బంగ్లాదేశ్ కు ప్రత్యేకంగా 29 మిలియన్ డాలర్లు ఇచ్చారని బాంబు పేల్చారు. USAID డబ్బులు ఇచ్చింది భారత్ కు ఇవ్వలేదన్న ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ కథనం అవాస్తవమని ట్రంప్ ఏకంగా వివరాలు బయటపెట్టడం సంచలనంగా మారింది.