హ‌రికృష్ణ ఇష్యూలో కేసీఆర్ మ‌న‌సు దోచేశారా?

Update: 2018-08-31 06:11 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచ‌న‌లు అనూహ్యంగా ఉంటాయి. ఎప్పుడు ఏ విష‌యం మీద ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఒక ప‌ట్టాన అర్థం కాని రీతిలో ఉంటాయి. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు ప‌లువురి మ‌న‌సుల్ని దోచుకునేలా చేశాయ‌న్న మాట వినిపిస్తోంది. రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించిన హ‌రికృష్ణ ఉదంతంలో కేసీఆర్ స‌ర్కారు అనుస‌రించిన విధానాలు ప‌లువురి మ‌న‌సుల్ని దోచుకునేలా చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ మ‌ర‌ణ‌వార్త షాకింగ్ గా మారింది. హైద‌రాబాద్‌ కు తీసుకొచ్చిన హ‌రికృష్ణ భౌతిక‌కాయానికి నివాళులు అర్పించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ను ప్ర‌త్యేకంగా ప‌రామ‌ర్శించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల్ని ఓదార్చారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. త‌న కొడుకు క‌మ్ మంత్రి కేటీఆర్ కు హ‌రికృష్ణ కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి అంత్య‌క్రియ‌లు ఏ రీతిలో జ‌ర‌గాల‌న్న విష‌యాన్ని తేల్చాల్సిన బాధ్య‌త‌ను అప్ప‌జెప్పారు.

తొలుత మొయినాబాద్ లోని త‌మ ఫాం హౌస్ లో హ‌రికృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వ‌హించాల‌ని కుటుంబ స‌భ్యులు భావించారు. అయితే.. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హిస్తామ‌న్న కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యంతో మ‌హాప్ర‌స్థానంలో నిర్వ‌హించేందుకు ఓకే చేశారు. ప్ర‌స్తుతం ఎలాంటి రాజ‌కీయ ప‌దవి లేకున్నా.. మాజీ ఎంపీ హోదాలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు నిర్వ‌హించేందుకు తీసుకున్న నిర్ణ‌యం ప‌లువురి ని ఆక‌ట్టుకుంది.

పుట్టెడు శోకంతో ఉన్న నంద‌మూరి కుటుంబం విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం స‌రైద‌నే అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించిన హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌ల అనంత‌రం మ‌హాప్ర‌స్థానంలో హ‌రికృష్ణ స్మార‌కాన్ని నిర్మించ‌నున్న‌ట్లు చెప్ప‌టంతో పాటు.. అందుకు అవ‌స‌ర‌మైన స్థ‌లాన్ని ప్ర‌భుత్వం కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 
Tags:    

Similar News