తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ అత్యాధునిక సౌకర్యాన్ని రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించారు.
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12 వద్ద ఉన్న ఈ సెంటర్‌లో ఐదు టవర్లు A, B C, D మరియు E ఉన్నాయి. టవర్ A అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం.. నగర పోలీసుల యొక్క వివిధ విభాగాలు ఇందులో ఉంటాయి.. టవర్ Bలో డయల్ 100, షీ (టీమ్స్) సేఫ్టీ, సైబర్ మరియు నార్కోటిక్స్, ఇంక్యుబేషన్ సెంటర్, క్రైమ్స్ వింగ్ మరియు ఇతర వాటికి సంబంధించిన విభాగాలతో మొత్తం టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంటుంది.
టవర్ సిలో ఒక ఆడిటోరియంతోపాటు మ్యూజియం కూడా ఉంటుంది.. ఈ మ్యూజియం తెలంగాణ పోలీసుల చరిత్రను ప్రదర్శించేదిగా ఉంటుంది. 14 , 15 అంతస్తులలో 360-డిగ్రీల వీక్షణ గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు.
మీడియా ఇంటరాక్షన్ మరియు ట్రైనింగ్ సెంటర్ టవర్ Dలో భాగంగా ఉంటుంది. చివరి టవర్ Eలో బహుళ-విభాగాల సమన్వయం, సీసీటీవీ నెట్‌వర్క్ పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్, డేటా సెంటర్ ఉంటుంది. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 9.22 లక్షల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీసీటీవీ నెట్‌వర్క్ అనుసంధానం చేయబడి ఉంటుంది. పోలీసులు ఏ సమయంలోనైనా లక్ష కెమెరాలను పర్యవేక్షించేలా విదేశాల్లోని తరహాలో అత్యాధునిక నిఘానేత్రాన్ని హైదరాబాద్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ 3వ కన్నుగా చెప్పొచ్చు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించి అక్కడికి పోలీసులను పంపేలా దీన్ని తీర్చిదిద్దారు.
ఇది కాకుండా ఫీల్డ్ పోలీసింగ్‌కు మద్దతుగా బ్యాకెండ్ కార్యకలాపాలలో పనిచేసే సాంకేతిక బృందాలను ఉంచడానికి వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వార్ రూమ్ అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలను కలిగి ఉంటుంది. విపత్తు, సంక్షోభ నిర్వహణ కేంద్రం వలే కూడా పని చేస్తుంది.
భవనం పైన అమర్చిన సోలార్ ప్యానెల్‌లు కేంద్రానికి 0.5 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి అందిస్తాయి. దీనికి రీసైకిల్ మెటీరియల్‌ను నిర్మాణానికి ఉపయోగించారు. 35 శాతం భూమి తోటలతో ఆహ్లాదకరంగా చుట్టుపక్కల వాతావరణం ఉంటుంది.