తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి ఆయన సన్నిహితులు ఒక విషయాన్ని చెబుతుంటారు.నిజానికి ఇప్పుడు ప్రస్తావించే అంశాన్ని ఆయన్ను క్లోజ్ గా ఫాలో అయ్యే వారికి తెలిసిందే. పాత వాటి విషయంలో విముఖత ప్రదర్శించే కేసీఆర్.. కొత్త అంటే చాలు మక్కువ ప్రదర్శిస్తారని చెబుతారు. ఖర్చు విషయంలో వెనుకాడని తత్వం ఉన్న ఆయన్ను ఎవరైనా ‘కొత్త’గా అడిగితే వెంటనే ఓకే చెప్పటం కనిపిస్తుంది.
దసరా పర్వదినాన కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ఆయన.. అందుకు తగ్గట్లే భారీ కసరత్తును చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు మాటలు చెప్పినంత ఈజీ కాదన్న విషయం గడిచిన కొద్ది కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తున్న వారికి ఇట్టే అర్థమవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఎన్ని సమస్యలతో కూడుకున్న విషయాన్ని గుర్తిస్తూ.. ఇందులో భాగంగా ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకుంటూ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న బలమైన కాంక్షతో కేసీఆర్ దూసుకెళ్లటం కనిపిస్తుంది.
కొత్త జిల్లాలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు ఎన్నో ఉన్న వేళ.. కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకేసారి 17 కొత్తజిల్లాల్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అన్నీ కొత్తవి ఏర్పాటు చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు కొత్త వాటి విషయంలో కేసీఆర్ పెద్దగా అభ్యంతరం వ్యక్తమవుతున్న వేళ.. జిల్లా కలెక్టర్లు.. అధికారులు తమ అవసరాలకు తగ్గట్లుగా కొత్త వాహనాల కోసం ప్రభుత్వానికి వినతులు చేశారు. కొత్త అన్న మాట చెవిన పడిన వెంటనే.. ఓకే చెప్పేసే ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా నో చెప్పేయటం గమనార్హం.
దసరా రోజున స్టార్ట్ కానున్న కొత్త జిల్లా యంత్రాగానికి అవసరమైన వాహనాల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు. కొత్త జిల్లాలకు కొత్త వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులో.. ఖర్చుకు కళ్లాలు వేయాలని భావిస్తున్నారోకానీ కొత్త వాహనాల కోసం ముఖ్యమంత్రి నో చెప్పేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇలాంటి ఖర్చుల్ని లైట్ తీసుకునే సీఎం అందుకు భిన్నంగా ఇప్పుడున్న వాహనాల్నే వినియోగించాలని తేల్చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత వాహనాలనే కొత్త జిల్లాలకు వాడేయాలని తేల్చేశారు. జిల్లా కలెక్టర్ల విషయంలోనే కాదు ఎస్పీల విషయంలోనూ ఇదే విధానాన్ని ప్రభుత్వం స్పష్టం చేయటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. జిల్లాల్లో వాహనాల కొరత ఉంటే హైదరాబాద్ నుంచి పాత వాహనాలు జిల్లాలకు పంపుతామని చెబుతున్నారట. కేవలం బ్యూటిఫికేషన్.. రిపేర్లు.. స్టేషనరీకి సంబంధించిన కొనుగోళ్లను మాత్రమే ప్రభుత్వం ఓకే చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కంప్యూటర్లు.. ఫ్యాక్స్.. జిరాక్స్ మెషిన్లు.. కుర్చీలు.. బల్లలు లాంటి అత్యవసర స్టేషనరీ కొనుగోలుకు మాత్రమే ఓకే అంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు.. ఎస్పీలకు కొత్త ఫోన్ నెంబర్లు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు అయ్యాకే ఆయా జిల్లాల వెబ్ సైట్లను ఓపెన్ చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా కొత్త వాటి విషయంలో దూకుడుగా వ్యవహరించకుండా వీలైనంతవరకూ పాతవాటిని అడ్జెస్ట్ అవుతున్న తీరు చూస్తే.. ఖర్చు విషయంలో ముఖ్యమంత్రి మైండ్ సెట్ లో కాస్త మార్పు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.