ట్రంప్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్..ట్రంప్ భార్యకి అదిరిపోయే బహుమతి!

Update: 2020-02-25 05:45 GMT
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం భారత్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా నుండి అహ్మదాబాద్ కి చేరుకుంది తడువు .. క్షణం కూడా తీరిక లేకుండా బిజీ షెడ్యూల్ తో అహ్మదాబాద్ , ఆగ్రాని చుట్టేసి వచ్చారు. అలాగే ప్రపంచంలోని అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంలో నమస్తే ట్రంప్ సభలో ట్రంప్ , మోడీ జాతిని ఉద్దేశించిందని ప్రసంగించారు. అలాగే ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో తన రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు చాలా బిజీ బిజీగా గడపనున్నారు.

ఇక ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్ కు ట్రంప్ దంపతులు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అధికారిక స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ట్రంప్ స్వీకరించారు. అనంతరం, రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధిని దర్శించి నివాళ్లు అర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్ పర్యటన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం రాజ్‌ భవన్‌ లో విందు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 90 నుంచి 95 మంది వీఐపీలు పాల్గొననున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యే విందుకు రాష్ట్రపతి భవన్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ట్రంప్ కి ఇచ్చే విందుకి హాజరుకానున్న సీఎం కేసీఆర్ , ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీకానున్నారు. ఈ భేటీలో ట్రంప్ కి , అయన భార్య మోలానియా, అలాగే కూతురు ఇవాంకాకు అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్‌ కు ఫిలిగ్రి చార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపికను, పోచంపల్లి శాలువాను కేసీఆర్ ఇవ్వనున్నారు. అలాగే.. ట్రంప్ భార్య మెలనియా, కుమార్తె ఇవాంకాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి పోచంపల్లి, గద్వాల పట్టుచీరలను బహుమతి గా ఇవ్వనున్నట్లు సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ట్రంప్‌ కి రాష్ట్రపతి కోవింద్ ఇచ్చే విందులో తెలంగాణ వంటకాలు కూడా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఇక పోతే గతంలో ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్ లో ఒక సమ్మిట్ కి వచ్చిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News